ONE OF THE GREAT STORY TO TEACH A LESSON

ONE OF THE GREAT STORY TO TEACH A LESSON

పూర్వం ఇద్దరు రాజులు రధాలపై పొరుగు రాజ్యం వెళ్తూ ఇరుకైన ఒక వంతెన మీద ఎదురయ్యారు..
ఒక రాజు రధం వెనక్కి వెళ్తేనే గానీ రెండో రధం ముందుకు వెళ్ళే వీలు లేదు..
రధసారధులిద్దరూ నీ రధం వెనక్కి తీసుకెళ్ళంటే నీదే తీసుకెళ్ళమని వాదించుకోడంమొదలెట్టారు. ఇద్దరు రాజులూ ఏం జరుగుతుందా అని చూస్తున్నారు..
చివరికీ ఇద్దరు సారధులూ ఒక ఒప్పందానికి వచ్చారు..
వాళ్ళు తమ రాజుల గొప్పదనం చెప్పేట్టు.. ఏ రాజు గొప్పవాడో ఆరాజుకు రెండో రాజు ముందు దారి ఇచ్చేట్టు..
సరే మొదటి రధసారధి ఇలా అన్నాడు..
మా రాజ్యంలో మా రాజుగారు రోజుకి వందమంది అభాగ్యులకి ఆకలి బాధతో ఉన్నవారికి భోజనం ఏర్పాటుచేసి గానీ వారు భుజించరు.. గుడ్డలు కూడా లేని వారికి రోజుకి ఐదారువందలమందికి వస్త్రదానం చేస్తారు.. అనాధ శరణాలయాలు..వృధా 
ధాశ్రమాలూ స్థాపించారు..
రెండవ సారధి తలదించుకుని కంట నీరుపెట్టుకుని తన రధం వెనక్కి తీయడానికి సిద్ధమయ్యాడు..
దానికి ఆరాజు గారిలా అడిగారు.. ఏమయ్యా మీ రాజుకి దాన గుణంలేదా అలా ఏమీ చెప్పకుండా రధం వెనక్కి తిప్పుకుంటున్నావు..
దానికా రెండో రధ సారధి వినయంగా ఇలా అన్నాడు..
హే రాజా మా రాజుగారు దానం చేస్తుండగా చూసే అదృష్టం మా రాజ్యం లో ఎవరికీ కలగలేదు.. మా రాజ్యం లో దానం చేద్దామంటే సామాన్యులమైన మాకే ఒక్క దీనుడూ కనబడలేదు.. వృద్ధాశ్రమాల్లో ఉండాల్సిన అవసరమూ ఏనాడూ ఎవరికీ కలగలేదు..ఇంక మారాజుగారికా అవకాశం ఎలఎలా ఉంటుంది.. దానం చేసే అవసరం అవకాశం మా రాజ్యంలో లేదు ప్రభూ అని.
వెంటనే మొదటి రధంలో రాజు రధం దిగి రెండవ రాజుకు పాదాభివందనం చేసి తనరధం వెనక్కి తీయించి దారి ఇచ్చాడు..
వేల వృద్ధాశ్రమాలూ..రాయితీలు.సంక్షేమపధకాలూ ఉచితాలూ.. అభాగ్యులకు సేవలూ దశాబ్దాలుగా అమలు చేసే పరిస్థితులున్న.. ఆశించే పౌరులున్న ఏ దేశమూ మంచి పాలనలో ఉన్నట్టు కాదు..
అది సరైన పాలనా కాదు..

పాలకుల పాలితుల దౌర్భాగ్యానికి చిహ్నం ఆ దేశం..

Post a Comment

0 Comments