అర్ధ వేతన సెలవులు (HALF PAY LEAVES)
👉 ఈ సెలవుల ప్రస్తావన AP Leave Rules నందు 13,18,23 నందు పొందుపరచారు
👉 సర్వీసు రెగ్యులరైజ్ అయిన తరువాత నియామక తేది నుండి ప్రతి సం॥ కి 20 రోజుల అర్ధవేతన సెలవు జమచేయబడుతుంది.
👉 సం॥ నకు కొన్ని రోజులు తక్కువైనను ఈ సెలవు రాదు.(G.O.Ms.No.165 Dt:17-08-1967)
ఉదా: ఒక ఉద్యోగి 25.04.1990 న అపాయింట్ అయ్యి 31.12.2020 న రిటైర్ అవుతాడు అనుకుంటే అతని HPL ఖాతా లెక్కింపు విధానం..
25.04.1990 నుండి 24.04.2020 వరకు 30 ఏళ్ళ సర్వీసుకు 30*20=600 రోజులు జమ చేస్తారు.
25.04.2020 నుండి 31.12.2020 వరకు ఉన్న సర్వీస్ పీరియడ్ కు హాఫ్ పే లీవ్ ఏమి జమ కాదు.
కారణం:ఒక సం. సర్వీస్ కు కొన్ని రోజులు తక్కువైన ఈ సెలవు జమ కాదు
👉ఈ సెలవు జమచేయుటకు డ్యూటీ కాలముతో పాటు అన్ని రకాల సెలవుల పై వెళ్ళిన కాలాలను కూడా పూర్తి సం॥ సర్వీసు క్రింద పరిగణిస్తారు
EOL కి వెళ్లినా కూడా ఆ పీరియడ్ కి కూడా ఈ సెలవు మంజూరు చేస్తారు.అందుకే దీనిని "Un earned leave" అంటారు.
👉అర్జిత సెలవును (Earned Leave) మాదిరి జనవరి నెల మొదట, జూలై నెల మొదట తేదిన అర్ధవేతన సెలవు జమచేయరు. సం॥ సర్వీసు పూర్తి చేసిన తర్వాతనే సగం జీతపు సెలవు ఖాతాకు జమచేస్తారు.
👉 అర్ధవేతన సెలవు రెండు రకాలుగా మంజూరు చేస్తారు.
1.వైద్య ధృవపత్రం ఆధారంగా(Medical Certificate)
2. స్వంత వ్యవహారాలపై (Private Affairs)
👉 సంపాదిత సెలవు నిల్వయున్నను అర్ధవేతన సెలవు వాడుకోవచ్చును.
ఇంక్రిమెంట్లు,సర్వీసుకు ఎటువంటి ఆటంకం కలగదు.*
👉 వైద్య కారణముల పై అర్ధవేతన సెలవు పెట్టి పూర్తి జీతం పొందుటను కమ్యూటెడ్ సెలవు అందురు.సెలవు పెట్టిన రోజులకు రెట్టింపు రోజులు అర్ధజీతపు సెలవు ఖాతా నుండి తగ్గిస్తారు.
{APLR 15(B) & 18(B}
👉కమ్యూటెడ్ సెలవును 180 రోజుల నుండి 240 రోజులకుపెంచడమైనది. (G.O.Ms.No.186 Dt:23-07-1975)
👉సర్వీసు మొత్తంలో 480 రోజుల అర్ధజీతపు సెలవుల స్థానంలో240 రోజుల పూర్తి జీతం పొందవచ్చు {Rule 15(B}
👉 240 రోజుల పూర్తి జీతం వాడుకోగా మిగిలిన సెలవులను అర్ధజీతంతో మాత్రమే వాడుకోవాలి.
👉 వైద్యకారణాల పై సెలవు పొందాలంటే Form-A,B లను సమర్పించాలి.
👉 వ్యక్తిగత అవసరాలకు అర్ధవేతన సెలవును వినియోగించుకున్నచో వేతనం, డి.ఏ సగము మరియు అలవెన్సులు పూర్తిగా చెల్లిస్తారు
(Memo No.3220/77/A1/PC-01/05 Dt:19-02-2005)
(Memo No.14568/63/PC-1/A2/2010 Dt:31-01-2011)
👉 అర్దవేతన సెలవు 180 రోజులు దాటినచో HRA, CCA లు చెల్లించబడవు.
👉 క్యాన్సర్,మానసిక జబ్బులు,కుష్టు,క్షయ, గుండె జబ్బు,మూత్రపిండాల వైఫల్యం వంటి ధీర్ఘకాల వ్యాధులకు చికిత్స పొందుతున్న వారు సంబంధిత వైద్య నిపుణుడి ధృవపత్రం ఆధారంగా 6 నెలల గరిష్ట పరిమితితో తన ఖాతాలో నిల్వయున్న అర్ధవేతన సెలవులను వినియోగించుకుని పూర్తివేతనం పొందవచ్చును. (G.O.Ms.No.386 Dt:06-09-1996) (G.O.Ms.No.449 Dt:19-10-1976)
👉 వ్యాధిగ్రస్తులకు 8 నెలల వరకు HRA,CCA లు పూర్తిగా చెల్లిస్తారు. (G.O.Ms.No.29 Dt:09-03-2011)
👉 ఎట్టి పరిస్థితులలోనూ కమ్యూటెడ్ సెలవును HPL గా మార్చుకొనుటకు వీలులేదు. (G.O.Ms.No.143 Dt:01-06-1968)
👉 ఇట్టి సెలవు వినియోగించుకున్న తర్వాత ఉద్యోగి తిరిగి డ్యూటీలో చేరాలి.కాని ఏ కారణం చేతనైనా రాజీనామా చేయుటకు గాని,లేక పదవీ విరమణ చేయుటకు గాని సిద్దపడినట్లయితే అట్టి సందర్భాలలో అంతకుముందే మంజూరైన కమ్యూటెడ్ సెలవును సగం జీతం సెలవుగా మార్చి అధికంగా పొందిన సెలవు జీతం అట్టి ఉద్యోగి నుండి తిరిగి రాబట్టాలి.
👉 సెలవు పెట్టి తిరిగి డ్యూటీలో చేరకముందే ఉద్యోగి మరణించినా కమ్యూటెడ్ సెలవు మరియు సగం జీతం సెలవు జీతాలలో తేడాను అట్టి ఉద్యోగి నుండి తిరిగి వసూలు చేయనవసరం లేదు.(G.O.Ms.No.33 F&P Dt:29-01-1976)
ప్రత్యేక అర్ధవేతన సెలవు
👉లెప్రసీ,టి.బి,క్యాన్సర్, మానసిక అనారోగ్యం, గుండె జబ్బులు, మూత్రపిండాల వైఫల్యంతో వంటి వ్యాధులతో ధీర్ఘకాల చికిత్స పొందుతున్న వారు,సంబంధిత వైద్య ధృవపత్రం ఆధారంగా 6 నెలల గరిష్ట పరిమితితో తన ఖాతాలో నిల్వయున్న అర్ధవేతన సెలవును వినియోగించుకుని పూర్తివేతనం పొందవచ్చు.
(G.O.Ms.No.188 Fin Dt:30-07-1973)
(G.O.Ms.No.386 Fin Dt:06-09-1976)
(G.O.Ms.No.20 Fin Dt:25-01-1977)
👉 గుండె జబ్బులకు: (G.O.Ms.No.449 Fin Dt:28-10-1976)
👉 మూత్రపిండ వైఫల్యానికి: (G.O.Ms.No.268 Fin Dt:25-01-1977)
👉 సెలవులో వెళ్ళడానికి ముందు పొందిన వేతనం ఆధారంగా మాత్రమే సెలవు కాలపు జీతభత్యాలు చెల్లించబడతాయి.
👉 ఏ కారణం వల్లనైనా సెలవు మధ్యలో వేతనం పెంపుదల జరిగినప్పటికీ, సెలవు అనంతరం డ్యూటీలో చేరిన తేది నుండి మాత్రమే ఆర్ధిక లాభం వర్తింపచేస్తారు._
👉 6 నెలల వరకు వినియోగించుకున్న అన్ని రకాల సెలవులకు HRA,CCA చెల్లించబడుతుంది.(G.O.Ms.No.28 Fin Dt:09-03-2011)
👉 కుష్టు,గుండె జబ్బు,క్యాన్సర్,ఎయిడ్స్,మానసిక అనారోగ్యం, మూత్రపిండాల వైఫల్యం వంటి జబ్బుల చికిత్స సందర్భంలో 8 నెలల వరకు HRA చెల్లించబడుతుంది.
0 Comments
Please do not Enter any Spam link in the Comment Box