AP Revised Pension Rules 1980
ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉంటే ఫుల్
పెన్షన్ కు ఎలిజిబిలిటీ ఉంటుంది? ఏయే బెనిఫిట్స్ వర్తిస్తాయి?
జ:- 20 సంవత్సరాల సర్వీసు నిండిన ఉద్యోగి యొక్క కోరిక ప్రకారం రిటైర్
అగుటకు అనుమతించబడును.
( G.O (P) No. 88, Finance and Planning (Finance Wing) P.N.C.
Dept, Date: 26-01-1980 ) రూల్ : 42,43
వాలెంటరీ రిటైర్మెంటు పొందిన ఉపాధ్యాయుడు
తన పెన్షన్ లో 40% అమ్ముకోవచ్చును. దీనినే పెన్షన్
కమ్యూటేషన్ అంటారు.
( G.O.m.s.No: 158, Finance and Planning ; Date: 16-09-1999)
గమనిక:- రిటైరైన సంవత్సరంలోగా సంబంధిత
అధికారిగారికి దరఖాస్తు చేసుకోవాలి. సంవత్సరం దాటితే మెడికల్ టెస్టులు, అనేక వివరాలతో జాప్యం జరుగుతుంది
పెన్షన్ లెక్కించు విధానము:-
చివరి నెల వేతనం× అర్థ సం. యూనిట్లు × 1/2 × 1/66 సూత్రం ప్రకారం లెక్కిస్తారు
20 సంవత్సరాలకు వాలెంటరీ రిటైర్మెంటు కోరితే
5సంవత్సరాల వెయిటేజిని కలిపి సర్వీస్ కాలమునకు
కలిపి పెన్షన్ నిర్ణయిస్తారు.
కుటుంబ పెన్షన్ వివరాలు
రిటైర్మెంట్ గ్రాట్యుటీ
మినిమం క్వాలిఫైయింగ్ సర్వీస్:
5 ఇయర్స్ ఫైనాన్షియల్ బెనిఫిట్:
క్వాలిఫైయింగ్ సర్వీస్ పొడవు ఆధారంగా. సుమారు మొత్తం Rs.12.00 లక్షల .
డెత్ గ్రాట్యుటీ
0-1 సంవత్సరాలు సేవ: 6 టైమ్స్/ 4 (చెల్లింపు రోజు)
1-5 సంవత్సరాల సేవ: 18 సార్లు / 4 (పే,డీఏ )
5-18 సంవత్సరాల సర్వీస్: 36 సార్లు 4 (పే-డే) > 18 సంవత్సరాల సేవ: 38
/4 (చెల్లించాల్సిన రోజు)
మాక్సిమం మొత్తం: Rs.12.00 లక్షల. కుటుంబ పింఛను ఉద్యోగి / పెన్షనర్ యొక్క కుటుంబ సభ్యులకు
ఇవ్వబడుతుంది.
పెన్షన్ రకాలు
1. పెంపొందించిన కుటుంబ పెన్షన్ :-
మిని క్వాలిఫైయింగ్ సర్వీస్:
ఏడు సంవత్సరాలు కంటే ఎక్కువ ఏడు
సంవత్సరాల కాలానికి 50% చివరి చెల్లింపు మరియు ఏడు సంవత్సరాలు
లేదా 65 సంవత్సరాలుగా చెల్లింపులు.
2. కుటుంబ పెన్షన్ : -
మిని క్వాలిఫైయింగ్ సర్వీస్:
ఒక సంవత్సరం నుండి 7 సంవత్సరాల. పెంచిన కుటుంబ పెన్షన్ ముగిసిన తరువాత, కుటుంబ పింఛను ఇవ్వబడుతుంది. మొత్తం చెల్లింపు మరియు అనుమతుల యొక్క 30%
3. అదనపు సాధారణ కుటుంబ పెన్షన్:-
అతని / ఆమె విధులను
నిర్వర్తిస్తున్నప్పుడు మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు అతని పింఛను
ఇవ్వబడుతుంది,
FAMILY PENSION
సర్వీస్ లో ఉండి గానీ, రిటైర్ ఐన తరువాత గానీ ఉద్యోగి మరణించిన ,అతని భార్య కు ఇచ్చే పెన్షన్ ను ఫ్యామిలీ పెన్షన్ అంటారు.
7ఇయర్స్ సర్వీస్ లోపు చనిపోతే, భార్యకు పే లో 30% ఫ్యామిలీ పెన్షన్ గా ఇస్తారు.
7ఇయర్స్ సర్వీస్ పైన చేసి రిటైర్మెంట్
లోపు చనిపోతే రెండు రకాలుగా భార్యకు ఫ్యామిలీ పెన్షన్ చెల్లిస్తారు.
a) మొదటి 7 ఇయర్స్ కి 50%
b) 7 ఇయర్స్ తరువాత నుండి 30%.
EXample* 1:
ఒక ఉద్యోగి సర్వీస్ లో ఉండగా
మరణించెను. అప్పటికి అయన సర్వీస్ 3y 6m. అపుడు ఆతని పే 7740 ఐన, భార్య కు వచ్చే ఫ్యామిలీ పెన్షన్:
➡
7740×30/100 =2322.00
ఇది భార్య కు జీవితాంతం ఇస్తారు.
Example* 2:
ఉద్యోగి మరణించే నాటికి చేసిన సర్వీస్ 8y
4m. అపుడు పే 11530. ఐన, అతని భార్య కు మొదటి 7ఇయర్స్ వచ్చే ఫ్యామిలీ పెన్షన్:
11530×50/100=5765.00.
7 ఇయర్స్ తరువాత నుండి జీవితాంతం వచ్చే
ఫ్యామిలీ పెన్షన్👉 11530×30/100 = 3459.00
0 Comments
Please do not Enter any Spam link in the Comment Box