Commutation Rules of Pensioners


Commutation Rules of Pensioners

(COMMUTATION RULES )

Communication Rules of Employees



ఉద్యోగికి లభించే పింఛను నుంచి 40% మించ కుండా ఒకేసారి నియమ నిబంధనల మేరకు ఏకమొత్తంగా అతను నగదుగా మార్చుకునే పద్దతినే "Commutation" గా పరిగణిస్తారు.

ఈ పద్దతి 1-4-1999 నుండి అమలులోకి వచ్చింది.1-4-1999 తేదీన గాని,అటు తర్వాత గాని పదవీ విరమణ గాని,చనిపోయిన ఉద్యోగి విషయంలో గాని ఈ సూత్రం వర్తిస్తుంది.

(G.O.Ms.No.158 F&P తేది:1-4-1999)

శాఖాపరమైన న్యాయస్థానాలలో గనుక ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలు అపరిష్కృతంగా ఉన్నట్లయితే Commutation మంజూరు చేయబడదు.

(Rule 3(3) of Commutation Rules 1994)

కమ్యూటేషన్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోనవసరంలేదు. ప్రభుత్వం

G.O.M.No.263 తేది:23-11-1998 ద్వారా నిర్దేశించిన పింఛను ఫారంలోనే,పింఛనుతో పాటు Commutation ను కూడా తెలియజేయవచ్చు.

(G.O.Ms.No.356 F&P తేది:28-11-1989)

పెన్షన్ Commutation చేసిన తరువాత తగ్గిన పెన్షన్ 15సం॥ తర్వాత మాత్రమే తిరిగి పూర్తి పింఛను వస్తుంది.ఈ విధంగా మరల పూర్తి పెన్షన్ పొందిన తర్వాత రెండవసారి కమ్యూట్ చేయు అవకాశం లేదు.

(G.O.Ms.No.44 F&P తేది:19-02-1991)

15 సం॥ కాలపరిమితిని కమ్యూట్ చేసిన మొత్తం పొందిన తేది నుంచి గానీ లేక ఆ మొత్తం వసూలు చేసుకోమ్మని జారీచేసిన ఉత్తర్వులు 3 నెలల తర్వాత గానీ ఏది ముందైతే ఆ తేది నుండి లెక్కిస్తారు.

(G.O.Ms.No.324 F&P తేది:20-08-1977)

Commutation మొత్తం పొందిన తర్వాత ఏ కారణము చేతనైనా పెన్షన్ సవరించినయెడల,తత్ఫలితంగా పెన్షన్ ఎక్కువ అయిన సందర్భాలలో తదనుగుణంగా పెరిగినటువంటి Commutation మొత్తం కూడా చెల్లించవలసియుంటుoది.

(G.O.Ms.No.392 F&P తేది:02-12-1993)

Commutation మొత్తానికి, Gratuity మాదిరిగా గరిష్ట మొత్తంను నిర్దేశించలేదు. ఎంతమేరకు అర్హులో అంతవరకూ పొందవచ్చు.

Post a Comment

0 Comments