Covi-19 Questions&Answers

Covid-19 Questions&Answers

Covi-19 Questions&Answers


➸మీ ప్రశ్నకు బదులిదే..!
➸ఇంటికి వైరస్‌ను మోసుకెళుతున్నామా?
➸చెప్పులకు అది అంటుకుంటుందా వంటి సందేహాలకు సమాధానాలు
లాక్‌డౌన్‌లు తెరుచుకుంటూ.. జనం నెమ్మదిగా సాధారణ జీవితంలోకి అడుగుపెడుతున్న వేళ వారికి సరికొత్త అనుమానాలు, ఆందోళనలు చుట్టుముడుతున్నాయి. నేను ఇంటికి వైరస్‌ను మోసుకెళున్నామే..! నేను వేసుకుంటున్న దుస్తులు సురక్షితమైనవేనా? వాటికి వైరస్‌ అంటుకుంటుందాబయటి నుంచి వచ్చిన ప్రతిసారీ స్నానం చేయాలా? బూట్లు, చెప్పుల పరిస్థితి ఏమిటి? వంటి ప్రశ్నలతో సతమతం అవుతున్నారు. న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక అక్కడి శాస్త్రవేత్తలతో మాట్లాడి... ఈ సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేసింది.
➸నిత్యావసరాలు, ఔషధాలు తదితరాల కోసం బయటికి వెళ్లి వచ్చిన తర్వాత ఒంటిపై దుస్తులు విప్పేయాలా
తలస్నానం చేయాలా?
➸‘‘కొవిడ్‌ బాధితులు, వైరస్‌ గుప్తవాహకులు తుమ్మినా, దగ్గినా... వారి నుంచి వచ్చే తుంపర్లు, శ్వాస రేణువులు గాలిలో అర గంట వరకు ఉంటాయని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి. అవి అటు నుంచి ఇటు గాలిలో ప్రయాణించలేవు. నెమ్మదిగా నేలపైనే పడిపోతాయి’’ అని వర్జీనియా టెక్నాలజీస్‌(అమెరికా)లో శ్వాస రేణువులపై పరిశోధిస్తున్న శాస్త్రవేత్త లిన్‌సే మార్‌ తెలిపారు. అంటే రేణువులు మన దుస్తులను అంటుకునే శాతం చాలా తక్కువగా ఉంటుందన్నారు. మనలోని చాలామంది భౌతిక దూరం పాటిస్తున్నారు కాబట్టి బయటికి వెళ్లి వచ్చిన ప్రతిసారీ దుస్తులు మార్చుకోవడం, స్నానం చేయడం అవసరం లేదన్నారు. చేతులను మాత్రం సబ్బు నీళ్లతో తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలని స్పష్టంచేశారు. ఒకవేళ మీకు సమీపంలోఎవరైనా తుమ్మినా, దగ్గినా దుస్తులు మార్చుకుని, స్నానం చేస్తేనే మేలు.
➸సూక్ష్మ తుంపర్లు, శ్వాస రేణువులు మన దుస్తులను ఎందుకు అంటుకోవు?
➸‘‘ఎరోడైనమిక్స్‌ ప్రకారం... మనిషి శరీరం చుట్టూ గాలి ప్రవాహం ఉంటుంది. దాని ఒత్తిడి కారణంగానే మనం నెమ్మదిగా కదులుతాం. అడుగేస్తున్న ప్రతిసారీ ఈ గాలిని ముందుకు నెడతాం. అప్పుడు గాలిలోని సూక్ష్మ తుంపర్లు, రేణువులు సైతం ముందుకు వెళతాయి. అందుకే అవి మన దుస్తులపై పడవు. ఎవరైనా మనకు రెండు మీటర్ల కంటే అతి దగ్గరగా ఉండి దగ్గి, తుమ్మితేనే తుంపర్లు అంటుకుంటాయి’’ అని శాస్త్రవేత్త లిన్‌సే మార్‌ వివరించారు.
తల వెంట్రుకలు, గడ్డంలో వైరస్‌ నిలిచి ఉండే ప్రమాదముందా?
➸‘‘ప్రతి ఒక్కరూ భౌతిక దూరంతోపాటు, మాస్కును ధరించినంత కాలం వెంట్రుకలతో వైరస్‌ సోకే సమస్య ఉండదు. ఒకవేళ మన వెనుక ఎవరైనా తుమ్మినా, దగ్గినా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు’’ అని వాషింగ్టన్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన పరిశోధకుడు డాక్టర్‌ ఆండ్రూ జనోవిస్కీ తెలిపారు. వైరస్‌ వాహకులు సైతం మాస్కు ధరిస్తే వ్యాధి ఇతరులకు సోకే అవకాశం చాలా తక్కువ శాతం ఉంటుందన్నారు. 
➸దుస్తులు ఉతికేప్పుడు వైరస్‌ బారిన పడే ప్రమాదముందా?
➸‘‘మనం ఎవరి దుస్తులు ఉతుకుతున్నామనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. కరోనా వైరస్‌లు సబ్బులకు లొంగుతాయి. సాధారణ దుస్తులను సర్ఫ్‌, సబ్బులతో ఉతికేప్పుడు ఎలాంటి సమస్యా ఉండదు. ఉతికిన తర్వాత బాగా ఎండనిస్తే సరిపోతుంది. ఒకవేళ జబ్బు పడిన వారిని కలిసినా, వారికి సపర్యలు చేసినా, వారి దుస్తులను ఉతుకుతున్నా... జాగ్రత్తలు తీసుకోవాలి. మిషిన్‌లో ఉతికితే నీటిని సాధ్యమైనంత ఎక్కువ వేడి చేసేలా దాన్ని సెట్‌ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దుస్తులను విదిలించరాదు. వాటిని పూర్తిగా ఆరనివ్వాలి’’ అని శాస్త్రవేత్త లిన్‌సేమార్‌ సూచించారు.
➸దుస్తులు, ఇతర ఉపరితలాలపై వైరస్‌ ఎంతకాలం బతికి ఉంటుంది?
➸‘ది న్యూ ఇంగ్లాండ్‌ జర్నల్‌లో మార్చిలో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం... కరోనా వైరస్‌ సాధారణ పరిస్థితుల్లో లోహాలు, ప్లాస్టిక్‌పై మూడు రోజులు, కార్డ్‌బోర్డ్‌పై 24 గంటలపాటు బతికి ఉంటుంది. ఈ అధ్యయనం దుస్తుల గురించి పరిశోధించలేదు. అయితే కార్డ్‌బోర్డ్‌లో ఉండే పోగులు... సాధారణ ఉపరితలాలపై కంటే ముందుగానే వైరస్‌ ఎండిపోయేలా చేశాయిఅని నిపుణులు భావిస్తున్నారు. కరోనా కుటుంబానికే చెందిన సార్స్‌ ప్రబలినప్పుడు 2005లో కాటన్‌ గౌన్‌పై ఒక అధ్యయనం చేశారు. అత్యధిక స్థాయిలో వైరస్‌ను వేసినప్పుడు కూడా దాని ప్రభావం 5 నిమిషాల నుంచి 24 గంటల్లోనే తొలిగిపోయినట్లు గుర్తించారుఅని డాక్టర్‌ ఆండ్రూ జనోవిస్కీ తెలిపారు.
బయటికి వెళ్లి వచ్చిన ప్రతిసారీ బూట్లు, చెప్పులను శానిటైజర్‌తో డిస్‌ఇన్‌ఫెక్ట్‌ చేయాలా?
‘‘బూట్లు, చెప్పులకు వైరస్‌, బ్యాక్టీరియాలు అధికంగానే అంటుకుంటాయి. అయితే అవి ఇన్‌ఫెక్షన్లకు అతి తక్కువ కారణం అవుతాయి. అమెరికాలోని రాక్‌ఫోల్డ్‌ షూ కంపెనీ వారు 2008లో చేసిన, ఇటీవల చైనాలో చేసిన అధ్యయనాల ప్రకారం... బూట్లకు గడ్డి పరకలు, దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా, వైరస్‌లు అంటుకున్నట్లు తేలింది. అందుకే వాటిని ఇంటి బయటే వదిలేయాలి. అవకాశముంటే శుభ్రంగా కడిగేయాలి. ఇంట్లో బూట్లు, చెప్పులు ధరించడం మానేయాలి. శౌచాలయానికి వెళ్లిన ప్రతిసారీ చేతులతోపాటు పాదాలను సైతం శుభ్రం చేసుకోవాలి’’ అని డాక్టర్‌ ఆండ్రూ జనోవిస్కీ వివరించారు.
➸వ్యాయామానికి, వ్యాహ్యాళికి, కుక్కలను బయట తిప్పడానికి వెళితే వైరస్‌ సోకే ముప్పు పెరుగుతుందా
‘‘ఇతరులకు దూరంగా ఉండటంతోపాటు చేతులను శుభ్రం చేసుకున్నంత వరకు ఆరుబయట వ్యాయామాలతో ఎలాంటి ముప్పూ ఉండదు. అదే సమయంలో వైరస్‌ వ్యాప్తి చెందకుండా బయట ప్రాంతాలను అధికారులు డిస్‌ఇన్‌ఫెక్ట్‌ చేయాల్సిందే’’ అని ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో ఉన్న వాతావరణ  నాణ్యత, ఆరోగ్యంపై అంతర్జాతీయ ప్రయోగశాల డైరెక్టర్‌ లిడియా మొరవస్క వివరించారు. ఆరుబయట వైరస్‌ తుంపర్లు గాలి ప్రవాహం కారణంగా వెంటనే డైల్యూట్‌ అవుతాయి. ప్రజలు కిక్కిరిసి ఉండే ప్రాంతాలకు వెళ్లనంత వరకు ఆరుబయలు సురక్షితమేనన్నారు

--------------------------------------------------------------------------------------------------

Your answer to the question ..!


Are you carrying the virus?

Answers to doubts as to whether it is sticking to the chauffeur

➸Lakdowns are opening up .. People are slowly getting back to normal life but they are surrounded by new suspicions and concerns. Why I carry the virus home! Is the dress I wear is safe? Do they have a virus? Have a bath every time you come in from the outside? What about shoes and sandals? With questions like that. The New York Times spoke to the scientists there ... and tried to dispel these doubts.
Need to wear shit after going out for necessities and medicines? Head to head?
➸Covid victims, guptavahakulu virus sneezes, coughs ... tumparlu coming from breathing airborne particles can be up to half an hour, according to various studies. They can no longer fly in the air. The slow telephone is the telephone, says Lynsey Marr, a scientist at Virginia Technologies (US) who is researching the particles of breath. This means that the percentage of particles sticking to our clothes is very low. Most of us follow a physical distance and therefore do not need to change clothes and take a bath every time we go out. Wash hands with soapy water. If someone near you sneezes and changes clothes, take a bath.
Why do microscopic tumors and breathing particles stick to our clothes?
➸ According to different aerodynamics ... the air flow around the man's body. Because of its pressure, we move slowly. Every time the wind blows we push this air forward. Then the tiny droplets and particles in the air move forward. That's why they don't fall on our clothes. Scientist Lynsey Marr explained that if someone gets closer than two meters to us, sneezes and sticks.

Is there a risk that the virus will remain in the hair of the blonde?
➸ As long as everyone wears a physical distance as well as a mask, hair will not be infected with the virus. "We don't need to be afraid of sneezing or sneaking up behind us," said Dr. Andrew Janovsky, a researcher at the University of Washington's School of Medicine. Virus carriers also have a very low chance of being infected by others if they wear them to the masses.

Is there a risk of getting infected by a virus while washing clothes?
➸ Depending on who is wearing clothing. Corona viruses are susceptible to soaps. There are no problems when it comes to surfing and washing ordinary clothes. It is best to dry it after washing. If the sick are getting together, treating them, keeping their clothes on ... Take care. If the machine is washed, it should be set to make the water as hot as possible. Under no circumstances should the clothing be flushed. Scientist Linsmauer suggested that it should be a complete telephone.

How long does the virus survive on the oceans and other surfaces?

According to a study published in March in the New England Journal ... Corona virus can survive under normal conditions for three days on metals, plastic and 24 hours on cardboard. This study did not investigate dress. However, the cardboard fibers ... experts believe that the virus has dried earlier than normal surfaces. A study of the cotton gown was made in 2005 during the reign of Sars, a member of the Corona family. Dr. Andrew Janovsky said that even when the virus was injected at the highest level, its effect was detected within 5 minutes to 24 hours.

Disinfect shoes and sandals with a sanitizer every time you go out?

➸ They are, however, the least likely cause of infections. According to a recent study in China by the Rockfold Shoe Company in the US in 2008, boots have been found to contain straw, dust, dirt, bacteria and viruses. That is why they should be left outside the house. Rinse clean if possible. We must stop wearing shoes and sandals at home. Dr Andrew Janovsky explained that every time you go to the toilet, you should wash your hands and feet.

Does the virus increase the risk of infection, outbreaks, and exposure to dogs?

➸ There is no thirty with outdoors exercises as long as you keep your hands clean and avoid the others. Lydia Morawaska, director of the International Laboratory for Climate Quality and Health in Brisbane, Australia, said that the authorities should be able to disinfect the outside without spreading the virus. Outdoors virus droplets dilute immediately due to airflow. The outdoors is safe until people go to crowded areas


Post a Comment

0 Comments