Covid-19 Do Not Distance Students From Schools

Do not distance students from schools

Covid-19 Do Not Distance Students From Schools

విద్యార్థులను పాఠశాలలకు దూరం చేయొద్దు💐💐💐..
➽పాఠశాలలు ఎందుకు యధావిధిగా పునః ప్రారంభించాలి అనే అంశం గురించి తెలుసుకోవాలి అంటే 2015 లో వెస్ట్ ఆఫ్రికాలో ప్రబలిన  *ఎబోలా వ్యాప్తి  నుండి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. 2014 లో వచ్చిన ఎబోలా వైరస్ మూలంగా వెస్ట్ ఆఫ్రికాలో Guinea, Liberia, Sierra Leone దేశాలలో 10,000 పాఠశాలలు 6 నుండి 9 నెలలపాటు మూత పడ్డాయి. 50లక్షల విద్యార్థులు బడులకు దూరం అయ్యారు.UNDP నివేదిక ప్రకారం 1848 గంటల విద్యను నష్టపోయారు. 25% మంది విద్యార్థులు ముఖ్యంగా బాలికలు శాశ్వతంగా పాఠశాలకు దూరమయ్యారు.వీరిలో అధికులు పేదలు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

The Alliance for Child Protection and Humanitarian Action నివేదిక ప్రకారం ఎబోలా వ్యాప్తి వల్ల బాలకార్మికులు పెరిగారు. ఇంటి వద్ద ఉన్న పిల్లలు తల్లితండ్రుల నుండి హింసకు గురయ్యారు. బాలికలపై భౌతిక, లయింగిక వేధింపులు ఎక్కువయ్యాయి.

ఇదే పరిస్థితి కోవిడ్ 19 విషయంలో కనుక జరిగితే ఒక కోటి మంది విద్యర్థినులు పాఠశాలలకు దూరం అవుతారని మలాలా ఫండ్ సంస్థ విశ్లేషించింది. బాల్య వివాహాలు, హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా పెరిగే అవకాశం ఉంది.

అందుకే,  ఇప్పుడు దీర్ఘకాలికంగా పాఠశాలలు మూసిఉంచడం సమస్యకు పరిష్కారం కాదు.

ప్రస్తుతము కోవిడ్ 19 సమయంలో విద్యను కొనసాగించేందుకు  సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ సలహాల్లో చాలామేరకు పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆచరణ సాధ్యం కానివే.
అన్నిటికన్నా ఎక్కువగా ప్రతిపాదిస్తున్నది ఆన్లైన్ విద్యా విధానం. ఆన్లైన్ విద్యావిధానానికి ఉన్న  అవరోధాలుపరిస్థితులు అనేక మందికి ఇప్పటికే అవగతం లో ఉన్నవి. ఇంటర్నెట్, డిజిటల్ టూల్స్ అందుబాటు ప్రధాన సమస్య.

➽ ఇక మిగిలినవి సరి బేసి విధానంలో పాఠశాలలు నడపడం,  షిఫ్ట్ సిస్టంలో పాఠశాలలు నడపడం online, off line పద్ధతిలో బ్లెండెడ్ విద్యా విధానం మొదలైనవి. వీటన్నింటిలో కూడా పాఠశాల నుండి విద్యార్థి కొన్ని రోజులు దూరంగా ఉండటం జరుగుతుంది. ఇంటి దగ్గర ఉండి నేర్చుకోవడము, దానికి తల్లిదండ్రుల నుండి అవసరమైనంత సహకారము అందడం, అందుకు అవసరమైనటువంటి technological ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పటికిప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అందుబాటులో ఉందా  అంటే పెద్ద సందేహం లేకుండా లేదు అని చెప్పవచ్చు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా అందరికి అందుబాటులో ఉండదు. ప్రతిపాదిత మార్గాలు అన్ని ఎబోలా సృష్టించిన విద్యా సంక్షోభం వైపు తీసుకువెళ్ళేవే.
ఈ ప్రతిపాదనల వల్ల ప్రధానంగా దెబ్బ తినేది ప్రభుత్వ పాఠశాలల్లో మరియు బడ్జెట్ ప్రైవేట్ స్కూల్లో చదివే విద్యార్థులు, అంటే పేద మధ్య తరగతి విద్యార్థుల పైనే ఇది ప్రభావం చూపించబోతున్నదన్నమాట. ప్రస్తుతము ఈ వైరస్కు వ్యాక్సిన్ గాని ఔషధాలు గాని లేనటువంటి పరిస్థితుల్లో మనము ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఈ వైరస్ యొక్క వ్యాప్తి కొంతకాలం కొనసాగుతోంది.  ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థులను ఎంతకాలం పాఠశాలలకు దూరంగా ఉంచాల్సి వస్తుంది చెప్పడం చాలా కష్టం. విద్యార్థులు పాఠశాలకు భౌతికంగా ఎంతకాలం దూరంగా ఉంటే అంత నష్టం, ఆ నష్టాన్ని పూడ్చ లేము.

అందుకని పైన చెప్పినటువంటి విధానాలు కాకుండా ఈ వైరస్ను సూటిగా కొమ్ములు వంచి ఎదుర్కోవాలనే నేను ప్రతిపాదిస్తున్నాను.

పిల్లల్లో కోవిడ్ 19 ప్రభావం పై శాస్త్రవేత్తలలో భిన్నాభిప్రాయలున్నవి. The Guardian కథనం ప్రకారం పాఠశాలలు పునఃప్రారంభించిన 22 యూరోపియన్ దేశాల్లో కరోన కేసులు ఏమి పెరగలేదు. కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని పాఠశాలలు ప్రారంభించారు. ఫ్రాన్సులో 40 వేల పాఠశాలలు ప్రారంభించిన తరువాత నమోదయింది 70 కేసులు మాత్రమే. "కరోన వల్ల జరిగే నష్టం కన్నా, విద్యార్థులు బడికి దూరం అవడంవల్ల జరిగే నష్టం ఎక్కువ"...Blanquer ( France Education Minister). జూన్ లో దాదాపు యూరోప్లో అన్ని పాఠశాలలు తెరుచుకునే అవకాశం ఉంది. జర్మనీ లో పిల్లలకు ఆట మైదానాలు కూడా తెరిచారు. యురోపియన్ దేశాలు కొన్ని ముఖ్యమైన చర్యలు తీసుకున్నారు

1. మొదట తక్కువ సంఖ్యలో విద్యార్థులను అనుమతించడం.
2. క్లాసులను రెండుగా విభజించడం
3. చేతులు కడుక్కోవడాన్ని ఖచ్చితంగా అమలు చేయడం
4. పాఠశాలలను disinfect చేయడం
5. భౌతిక దూరం పాటించడం
6. ఆటలాడే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం.
7. ఇంటర్వెల్, భోజన విరమాలు వేరు వేరు సమయాలు కేటాయించడం
8. పాఠశాలలో ఉన్న భౌతిక వనరులన్ని వినియోగించుకోవడం
9. తల్లితండ్రులకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సమగ్ర సమాచారం ఇవ్వడం, అవగాహన కల్పించడం
10.ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, సిబ్బందికి అవసరమైన రక్షణ కిట్స్ ఇవ్వడం
11. వ్యక్తిగత, సామాజిక పరిశుభ్రత పాటించడం.
12. పాఠశాల పనిగంటలు తగ్గించడం
13. సమూహ కార్యక్రమాలు తగ్గించడం
14. Respiratory Hygiene నేర్పించడం
15. High Risk పిల్లలు, టీచర్స్ కి కొంతకాలం సెలవులు ప్రకటించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం
17. భౌతిక దూరం అలవాటు పెంపొందించడం
 18. అనారోగ్యంతో ఉన్న పిల్లలు, టీచర్లు బడికి రాకుండా చూడటం
19. ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయటాం
20. ప్రతి తరగతికి class health leader ని నియమించడము
21. స్థానిక వైద్య సిబ్బందితో అనుసంధానం
22. అందరిని వైరస్ ని ఎదుర్కోవటానికి మానసికంగా సిద్ధం చేయాడము
23. కోవిడ్ 19 పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రోజు భోదించడం పాఠశాలలో విస్తృతంగా ప్రదర్శించడము
24. కోవిడ్ 19 లక్షణాలపై ఖచ్చితమైన అవగాహన కల్పన
25. థర్మల్ స్క్రీనింగ్.
26. పాఠశాలలో ఆరోగ్య కార్యకర్తలను నియమకం, ప్రత్యేక ఆరోగ్య గదులు ఏర్పాటు
27. కరోన సోకిన విద్యార్థులను చిన్నచూపు చూడరాదు. ఈ విషయం అందరికి అవగాహన కల్పించాలి
28. విద్యార్థులకు భరోసా కలిగించే చర్యలు
29. NO TOUCH అంశాన్ని పిల్లలకు అవగాహన కల్పించడము
30. తల్లితండ్రులు సహకారం.
 మన ప్రాంతంలో
ఇంకా అనేక చర్యలు సమయనుసారం తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు పాఠశాల నిర్వాహకులు సదా సిద్ధంగా ఉండాలి.

కరోన వైరస్ వల్ల జరిగే నష్టం అనంతం. ఆ మహమ్మారి తో పోరాడుతూనే మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. మహమ్మారి మూలంగా విద్యకు దూరంయితే జరిగే నష్టం ఇంకా ఎక్కువ.

అందరి సహకారంతో  విద్యార్థులు బడులకు వచ్చి, విద్యను అభ్యసించే దిశగా ఆలోచనలు చేద్దాం.వాట్సాప్ 
                                                                                                          ---వాట్సాప్ మెసేజ్ 
--------------------------------------------------------------------------------------------------------------------------


Do not distance students from schools

We have to learn some lessons from the rampant Ebola outbreak in West Africa in 2015. In 2014, 10,000 schools in Guinea, Liberia and Sierra Leone in West Africa were shut down for 6 to 9 months due to the 2014 Ebola virus. More than 50 million students have been turned away from school, and 1848 hours of education have been lost, according to a UNDP report. 25% of students, especially girls, are permanently away from school.

According to The Alliance for Child Protection and Humanitarian Action, Ebola outbreaks have increased child labor. Children at home have been subjected to violence from their parents. Physical and sexual abuse of girls has increased.

The same situation could have happened in the case of Kovid 19, the Malala Fund said. Child marriages and human trafficking are also likely to increase.

That's why closing schools for a long time now is not the solution.
At present Kovid 19 is advised to continue education. Many of these suggestions are impractical in poor and developing countries.

Above all, online education policy is being proposed. The barriers and conditions of online education are already understandable to many. Access to the Internet and digital tools is a major problem.

The rest is to run schools in an odd manner, schools in a shift system, blended education system in online and offline mode. In all of these, the student will be away from school for a few days. Learning at home, getting the support it needs from parents, and having the necessary technological infrastructure is now available in developing countries, without a doubt. It is not accessible to all, even in developed countries. All of the proposed paths are headed towards the educational crisis created by Ebola.

The main blow to these proposals is that it will have an impact on students studying in public schools and budget private schools, ie, poor middle class students. No matter how many attempts we have made in the absence of vaccines or drugs for this virus, the spread of this virus has been going on for some time now. It is difficult to say how long students will be kept away from school in such circumstances. If students are physically away from school for so long, that loss cannot be covered.

Therefore, I propose to confront the virus with straight horns rather than the above methods.
Scientists disagree on the effect of Covid19 on children. According to The Guardian article, 22 Coronation cases have not risen in the 22 European countries where schools are reopened. Schools were started with some special precautions. In France, after the opening of 40,000 schools, there were only 70 cases registered. "More than the damage caused by the corona, the damage done by the students to the distance from the school" ... Blanquer (France Education Minister). All schools in Europe are expected to open in June. Playgrounds for children have also been opened in Germany. European countries have taken some important steps

1. Allowing a smaller number of students first.
2. Divide the classes into two
3. Wash hands is strictly enforced
4. Disinfect schools
5. Practice physical distance
6. Taking good care while playing.
7. Interval and lunch breaks to allocate time
8. Utilize the physical resources of the school
9. To provide comprehensive information and awareness to parents, students and teachers
10.Provide protection kits for teachers, students and staff
11. Practicing personal and social hygiene.
12. Reducing school hours
13. Reducing group programs
14. Teaching Respiratory Hygiene
15. High Risk to announce holidays for children and teachers for a while
17. Developing a physical distance habit
18. Seeing sick children and teachers from school
19. Government regulations are strictly enforced
20. Appoint a class health leader for each class
21. Liaison with local medical staff
22. We are all mentally prepared to deal with the virus
23. The day-to-day teaching of the care of Kovid 19 is widely demonstrated in school
24. Providing an accurate understanding of the characteristics of Kovid 19
25. Thermal Screening.
26. Appointment of health workers in school and establishment of special health rooms
27. Corona-infected students should not be underestimated. This issue should be made public
28. Actions to reassure students
29. To educate children on the NO TOUCH topic
30. Parental Cooperation.

 In our area

There are many other steps that need to be taken in a timely manner. School administrators should be prepared for this.

The damage caused by the corona virus is endless. We have to move on while fighting that pandemic. If the pestilence is away from education

Post a Comment

0 Comments