Earned Leaves in Summer
వేసవికాలంలో యేయే సెలవులు వర్తిస్తాయి
📌 ఏ ఏ సందర్భాలల్లో సంపాదిత సెలవులు (ELs)
ప్రిజర్వ్ చెయ్యాలి అనే అంశాలతో సంచాలకులు
పాఠశాలవిద్యాశాఖ ఉత్తర్వులు Rc.No.03/plg-1/2020 తేది: 21.1.2020 విడుదల చేశారు.
📌 జనాభా లెక్కల డ్యూటీ చేస్తే
రెమ్యూనరేషన్ తో పాటు సంపాదిత సెలవులు(ELs) ఇస్తారు. కానీ వేసవిలో పదవ తరగతి స్పాట్ వాల్యువేషన్ కి రెమ్యునరేషన్ మాత్రమే ఇస్తారు సంపాదిత సెలవులు
(ELs) ఇవ్వరు.
📌 వెకేషన్ పరిధిలోకి వచ్చే పాఠశాలల్లో
పనిచేసే బోధన / బోధనేతర సిబ్బందికి
సంవత్సరానికి 6 సంపాదిత సెలవులు ( జనవరి 1 న 3,జులై 1 న మరో 3 సంపాదిత సెలవులను G.O.Ms.No.317 తేది: 15.9.1994 ద్వారా లీవ్ అకౌంట్ లో జమచేస్తారు.
📌 వేసవిలో 10వ తరగతి పరీక్షా
విధులు నిర్వర్తించే ప్రధానోపాధ్యాయులు మరియు ఆ పాఠశాలో పనిచేసే జూనియర్
అసిస్టెంట్/రికార్డు అసిస్టెంట్ ఆఫీస్ సబార్డినేట్ కు సంపాదిత సెలవులు మంజూరు
చేయాలి.
📌 ఒకవేళ ఆ పాఠశాలలో జూనియర్
అసిస్టెంట్/రికార్డు అసిస్టెంట్ పోస్టు మంజూరు లేనట్లయితే సీనియర్ టీచర్ కు
సంపాదిత సెలవులు మంజూరుచేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ELs ప్రిజర్వేషన్
ముగ్గురికి మించకూడదు.
📌 ఫండమెంటల్ రూల్ 82 లోని సబ్ రూల్ 15 ప్రకారం
వేసవిలో విధులు నిర్వహించి రెమ్యూనరేషన్ తీసుకున్నట్లయితే సదరు టీచింగ్/నాన్
టీచింగ్ స్టాఫ్ కు ELs మంజూరు చేయబడవు. అయితే
ఎన్నికల విధులు,జనాభా గణన,ఓటరు జాబితాల తయారీ/రివిజన్ విధులు నిర్వహించి రెమ్యూనరేషన్ పొందినను
G.O.Ms.No.35 Edn తేది: 16.1.1981 మరియు G.O.Ms.No.355
GAD తేది: 19.5.1995 ప్రకారం రెమ్యునరేషన్ గా పరిగణనలోకి
తీసుకోకుండా సంపాదిత సెలవులు మంజూరు చేస్తారు.
📌 వేసవిలో 10వ తరగతి
మూల్యాంకన (Spot) విధులు,ఇతరత్రా పరీక్ష విధులు నిర్వర్తించి TA&DA, రెమ్యునరేషన్ పొందిన సందర్భంలో సంపాదిత
సెలవులు(ELs)మంజూరు చేయబడవు.
📌 వేసవిలో పనిచేసిన కాలానికి G.O.Ms.No.114 Fin తేది:28.4.2005 ప్రకారం దామాషా పద్దతిలో (Prapoetinate) సంపాదిత సెలవులు మంజూరు చేస్తారు. 6 రోజుల సంపాదిత
సెలవులు కలుపుకుని ELs 30 రోజులకు మించకూడదు.
----------------------------------------------------------
What holidays apply in the summer:
📌School Directives Rc.No.03 / plg-1/2020 Issuing Requests to Preserve Earned Holidays (ELs) under Any Occasion
📌Earned Holidays (ELs) are given along with remuneration if census duty. But remuneration is only given to tenth-class spot valuation in the summer, not the Earned Holidays (ELs).
📌6 earned holidays per year for teaching / non-teaching staff working in vacation-covered schools (3 on January 1 and 3 on July 1 ) as per G.O.Ms.No.317
📌Principals performing 10th grade examinations during the summer and junior assistant / record assistant office subordinate working in the school should be granted earned leave.
📌In the absence of the post of junior assistant / record assistant in the school, the senior teacher should be granted leave. Under no circumstances should the ELs Preservation exceed three.
📌EL Sub-Rule 15 of Fundamental Rule 82 does not grant ELs to Teaching / Non-Teaching Staff if they undertake remediation during the summer. However, the remediation of electoral functions, census and voter lists preparation / revision functions is granted by GOMs.No.35 Edn Date: 16.1.1981 and GOMs.No.355 GAD Date: 19.5.1995. .
📌Earned Holidays (ELs) are not granted in the event of TA&DA, Remuneration for performing 10th Class Evaluation and other Examination functions during the summer.
📌G.O.Ms.No.114 Fin granted for work during the summer. ELs must not exceed 30 days, including 6 days of earned holidays.
0 Comments
Please do not Enter any Spam link in the Comment Box