Increment Arrears


INCREMENT ARREAR BILL


Increments



1. ఇంక్రిమెంట్ బకాయి బిల్లు ను ఖజానా కార్యాలయంలో A.P.T.C. ఫారం 47 లో  సమర్పించాలి.

 2. CCA నిబంధనల ప్రకారం సమర్థ అధికారి (Competent Authority) చే దుష్ప్రవర్తన లేదా అసంతృప్తికరమైన పని వంటి చర్యలు గైకొంటే తప్ప (FR 24) విధి నిర్వహణలో ఒక సంవత్సరం సంతృప్తికరమైన సేవ పూర్తి చేసిన తరువాత ఉద్యోగికి సాధారణంగా ఇంక్రిమెంట్ నిలిపివేయకుండగా మంజూరు చేయబడాలి.
 
 3. ఎఫ్ఆర్ 26 (ఎ) ప్రకారం ఒక పోస్ట్‌లో  (టైమ్ స్కేల్ గణనపై) చేసినట్టి డ్యూటీ అంతయు ఇంక్రిమెంట్ కోసం పరిగణనలోకి తీసుకోవడం జరుగును.

 4. FR 26 (బి) (i) ప్రకారం అన్ని భత్యాలతో మంజూరు చేసిన సెలవు ఇంక్రిమెంట్ కి పరిగణనలోకి తీసుకోబడుతుంది.

 5. *Medical Certificate పై EOL లేదా ప్రభుత్వ ఉద్యోగుల నియంత్రణలో లేని ఇతర కారణాలు లేదా ఉన్నత శాస్త్రీయ లేదా సాంకేతిక అధ్యయనాలను అభ్యసించడం కోసం సెలవు పొందిన యెడల తిరిగి డ్యూటీ లో చేరిన తదుపరి ప్రభుత్వం కి 5 ఏళ్లు సేవ చేస్తామని అంగీకారాన్ని తెల్పినపుడు ఆ ఉద్యోగి పొందిన లీవ్ పీరియడ్ కూడా ఇంక్రిమెంట్ కోసం లెక్కించబడును ( EOL కాలానికి ఇంక్రిమెంట్ ) .కాని ఇది ఉద్యోగి  మొత్తం సేవా కాలం లో ఒక సారి మాత్రమే మంజూరు చేయబడును. ఈ మంజూరు కి ఆరు నెలల కన్నా తక్కువ కాలానికి  HOD మరియు  6 నెలలు అంతకు మించిన కాలానికి ప్రభుత్వం కి మాత్రమే అధికారం కలదు.*
 [Ref: FR 26 b (ii) & Cir Memo.No.  యొక్క 21102-B / 371 / A2 / FR.I / 98 dt.7-8-98
 F&P [FW.FR.I] విభాగం.]

 6. ఇంక్రిమెంట్ చెల్లించాల్సిన నెల 1 వ తేదీ నుండి ఇంక్రిమెంట్ డ్రా అవుతుంది.
ఉదాహరణకు ఉద్యోగి Apr 19,2019 న విధులలో చేరాడు.అతని వార్షిక ఇంక్రిమెంట్ Apr 1, 2020 నుండి డ్రా చేయబడుతుంది.
 [Ref: G.O.Ms.No.133, F & P, Dt.13-05-74 మరియు GOMsNo192, F & P Dt.1-08-74

 7. ఇంక్రిమెంట్ కోసం లెక్కించని కాలాలు.
 ఎ) ప్రైవేట్ వ్యవహారాలపై EOL
 బి) FR18 కింద డైస్-నాన్-నాన్ గా పరిగణించబడే కాలం
 సి) క్రమబద్ధీకరించబడని అనుమతించిన దాని కంటే ఎక్కువ సమయం తీసుకున్న (excess) జాయినింగ్ టైం.
 d) అనుమతి లేకుండా లీవ్ నందు కొనసాగడం
 ఇ)  "నాట్ డ్యూటీ" గా పరిగనించిన సస్పెన్షన్ పీరియడ్
 f) అంతరాయ కాలం
 g) FR 35 ప్రకారం టైం స్కేల్ నందు  కనీస సమయం కంటే తక్కువ సర్వీస్ చేయడం
 h) అప్రెంటిస్‌గా సేవ

 8. *E.O.L కాకుండా అనుమతి పొందిన సెలవు కాలంలో ఇంక్రిమెంట్ వస్తే ఆ ఇంక్రిమెంట్ పెరుగుదల సదరు అర్హత తేదీ నుండి మంజూరు చేయబడుతుంది
కానీ ద్రవ్య ప్రయోజనం(Monetory Benefit) సెలవు గడువు ముగిసిన తరువాత చేరిన తేదీ నుండి ఇవ్వబడుతుంది.*
ఉదాహరణకు ఒక ఉద్యోగిని 01.01.2020 నుండి 6 నెలల materinity లీవ్ కి అనుమతి పొందారు.వారి ఇంక్రిమెంట్ ఏప్రిల్ నెలలో ఉంటే వారికి ఇంక్రిమెంట్ 01.04.2020 నుండి మంజూరు చేసినా, ఆర్ధిక ప్రయోజనం మాత్రం 6 నెలల లీవ్ ముగిసి డ్యూటీ లో చేరిన తేదీ నుండి మాత్రమే ఇస్తారు.

9. EOL విషయంలో కూడా ఇంక్రిమెంట్  తదనుగుణంగా వాయిదా వేయబడుతుంది.

 10. డిడిఓ ఇంక్రిమెంట్ మంజూరు ఉత్తర్వులతో పాటుగా APTC ఫారమ్ 49 లోని ఇంక్రిమెంట్ సర్టిఫికేట్ (15 నిలువు వరుసలలో ఉంటుంది) కూడా ఖచ్చితంగా జతపర్చాలి.
  [Ref: SR 13 & 15 OF TR 16 A.P. ట్రెజరీ కోడ్ వాల్యూమ్ -1]

 11. ఉద్యోగి సస్పెన్షన్ కాలంలో ఇంక్రిమెంట్ మంజూరు చేయబడదు.

Post a Comment

0 Comments