Leave Not Due-సంపాదించని సెలవు


🌱 సంపాదించని సెలవు -(LEAVE NOT DUE): 🌱

Leaves not due

  
AP Leave Rules 1933 మరియు 15C, 18C మరియు 25 ను అనుసరించి ప్రోబేషన్ కాలము సంతృప్తికరంగా పూర్తిచేసిన సుపీరియర్లు  మరియు నాల్గవ తరగతి సర్వీసులకు చెందిన ఉద్యోగులందరూ ఈ సెలవు పొందుటకు అర్హులు.

సంపాదించని సెలవు మెడికల్ సర్టిఫికెట్ పై మాత్రమే,సగం జీతం సెలవు ఖాతాలో నిల్వలేనపుడు భవిష్యత్ లో ఆర్జించిబోవు సగం జీతపు సెలవును వినియోగించుటకు ఈ సెలవు మంజూరు చేయవచ్చును.

[Rule 15(c) & 18(c)]
(G.O.Ms.No.543 F&P Dt:07-12-1977)

మొత్తం సర్వీసులో 180 రోజులకు మించకుండా ఈ సెలవు మంజూరు చేయవచ్చును. ఈ విధంగా మంజూరైన సంపాదించని సెలవు సగం జీతం సెలవు ఖాతాలో (-) గా నమోదుచేయాలి.

భవిష్యత్తు లో ఆ ఉద్యోగి సంపాదించుకోగలిగిన సగం జీతం సెలవుకు మించి ఇట్టి సెలవును మంజూరు చేయకూడదు.

ఉద్యోగి భవిష్యత్తు లో సగం జీతం సెలవు సంపాదించుకొగలడని, అంతేకాకుండా మంజూరైన సెలవు తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరుతాడని విశ్వసించినపుడు మాత్రమే సెలవు మంజూరు చేయాలి.

ఒకవేళ సంపాదించని సెలవులో ఉన్న ఉద్యోగి ఏ కారణం చేతనైనా స్వచ్ఛంద పదవీ విరమణ చేయదలచుకున్న అంతకు ముందు మంజూరు చేసిన సెలవు ఉత్తర్వులను రద్దుపరచాలి.అట్టి సందర్భాలలో సెలవు ఎప్పటినుండి ప్రారంభమయ్యిoదో అప్పటి నుండి స్వచ్ఛంద పదవీ విరమణ అమలులోకి వస్తుంది.

అనారోగ్య కారణంగా ఉద్యోగంలో కొనసాగుటకు అశక్తుడై పదవీ విరమణ చేసినా గాని,క్రమశిక్షణా చర్యల ప్రకారం నిర్భంద పదవీ విరమణ చేయబడినా గాని,లేక మరణించినా గాని ఆ ఉద్యోగికిచ్చిన సంపాదించని సెలవు జీతాన్ని వసూలు చేయనవసరం లేదు.
(G.O.Ms.No.290 F&P Dt:19-11-1981)

సంపాదించని సెలవులో ఉన్న ఉద్యోగులకు సగం జీతం సెలవులో పొందే సెలవు జీతం మరియు భత్యo చెల్లిస్తారు.

Post a Comment

0 Comments