Leave Sanctioning Authority In Education


విద్యా శాఖలో సెలవు మంజూరు అధికారం, సంబంధిత ఉత్తర్వులు

Leaves


👉విద్యాశాఖలో వివిధ రకాల సెలవుల మంజూరు,రిపోర్టింగ్,రిపోస్టింగ్ ఉత్తర్వులు ఇచ్చే అధికారుల కాలపరిమితిని నిర్ణయిస్తూ ఉత్తర్వులు ఇవ్వబడినవి.
(G.O.Ms.No.58,Edn తేది:22-04-2008)
(G.O.Ms.No.70,Edn తేది:07-07-2009)

 ☘ PS & UPS ప్రధానోపాధ్యాయులు:

👉పాఠశాలల్లోని సహోపాధ్యాయులకు CL, Spl.CL మంజూరు.

 ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు :

👉పాఠశాలల్లోని సహోపాధ్యాయులకు CL, Spl.Cl, CCL లతో పాటు 4 నెలల పరిమితితో ఇతర ఏ సెలవునైనా మంజూరు చేయవచ్చు.

మండల విద్యాధికారి(MEO):

👉మండల పరిధిలోని PS, UPS ప్రధానోపాధ్యాయులకు CL, Spl.CL, CCL మరియు ఉపాధ్యాయులందరికీ 4 నెలల పరిమితితో ఇతర ఏ సెలవునైనా మంజూరుచేస్తారు.

జిల్లా ఉపవిద్యాధికారి(Dy.EO):

👉హైస్కూల్ ప్రధానోపాధ్యాయులకు CL, Spl.CL, CCL లతో పాటు తన పరిధిలోని PS, UPS & HS ఉపాధ్యాయులందరికీ 6 నెలల వరకు ఇతర సెలవును మంజూరుచేస్తారు.

జిల్లా విద్యాశాఖాధికారి (DEO):

👉Dy.Eo, MEO లకు CL, Spl.CL, CCL మంజూరు చేస్తారు. Dy.Eo, MEO,హైస్కూల్ ప్రధానోపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయులందరికీ 6 నెలలకు పైబడి 1 సం॥ లోపు ఏ రకమైన సెలవునైనా మంజూరుచేస్తారు.

పాఠశాల విద్యాశాఖ సంచాలకులు(DSE):

👉మండల విద్యాధికారులకు, ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు 1 సం॥ పైబడి 4సం॥ వరకు ఏ రకపు సెలవునైనా పాఠశాల విద్యాశాఖ సంచాలకులు మంజూరు చేస్తారు. అంతకుమించిన కాలానికి సెలవు మంజూరు అధికారం ప్రభుత్వానికే ఉంటుంది.

ప్రసూతి సెలవు (Maternity Leave) సందర్భంలో
      
👉మహిళా ఉపాధ్యాయులకు 6 నెలల వరకు సెలవు మంజూరుచేయు అధికారం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, మండలంలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులకు సెలవు మంజూరు అధికారం మండల విద్యాధికారులకు (MEO) లకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసారు.
(G.O.Ms.No.84 తేది:17-09-2012)

విదేశాలకు వెళ్ళేందుకు సెలవు మంజూరు:
    
👉విదేశాలకు వెళ్ళే ఉపాధ్యాయులు ఏ రకమైన సెలవుపై ఎంతకాలం వెళ్ళదలచుకున్నా (5సం॥ లోపు) ప్రభుత్వం నుండి ముందుగా అనుమతి తీసుకోవాలి.విదేశాలలో ఉద్యోగం కొరకు వెళ్ళే ఉద్యోగులకు కొన్ని షరతులతో 5సం॥ వరకు EOL మంజూరుకు అనుమతిస్తారు.
(G.O.Ms.No.214 F&P తేది:03-09-1996)

Post a Comment

0 Comments