REGULATION OF PAY AND ALLOWANCES OF A GOVT. SERVANT WHOSE WHERE ABOUTS ARE NOT KNOWN:
1] ఒక ఉద్యోగి తన కుటుంబాన్ని విడిచిపెట్టి అదృశ్యమైతే మరియు అతని గురించి కుటుంబం సంబంధిత నివాస ప్రాంత పోలీసు స్టేషన్ నందు ఖచ్చితంగా ఫిర్యాదు చేసి ఉండాలి.
2] తగిన దర్యాప్తు మరియు అన్ని ప్రయత్నాలు చేసిన తరువాత పోలీసు అధికారులు ఉద్యోగిని గుర్తించలేదు (NOT TRACED)అని ఒక నివేదిక జారీ చేయాలి.
3] సెటిల్మెంట్ నిమిత్తం ఒరిజినల్ పోలీసు నివేదికను కుటుంబ సభ్యులు ప్రభుత్వం కి దాఖలు చేయాలి.
4] ఉద్యోగి సంబంధిత బకాయిలు / సెటిల్మెంట్ మొత్తం కుటుంబ సభ్యులకు చెల్లింపు చేయుటకు వారు ఇండెమ్నిటి బాండ్ ను సమర్పించాలి. తదుపరి ఒక వేళ ఉద్యోగి కనిపించిన సందర్భంలో అతనికి చెల్లింపు చేసిన మొత్తాలను తిరిగి చెల్లిస్తామని అంగీకార పత్రంను అందచేయాలి.
5] ఉద్యోగి సంబంధిత బకాయిలు చెల్లించేటప్పుడు, ఉద్యోగి ప్రభుత్వానికి చెల్లింపు చేయాల్సిన బకాయిలు/లోన్లు మరియు సదరు రికవరీ ప్రభావం ను కార్యాలయ అధిపతి అంచనా వేయాలి.
6] ఉద్యోగి అదృశ్యమైన తేదీ వరకు డ్యూటీ పీరియడ్ కాలానికి జీతం ను కుటుంబం కి చెల్లించవచ్చు.
ఉద్యోగి లీవ్ ఎన్‌కాష్మెంట్ బకాయిలు ఏమైనా ఉంటే ఉద్యోగి అదృశ్యం గురించి ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన తేదీ నుండి ఒక సంవత్సరం గడిచిన తరువాత వారసులకు చెల్లించాలి.
7] ఉద్యోగి అదృశ్యం గురించి ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన తేదీ నుండి ఒక సంవత్సరం గడిచిన తరువాత ఉద్యోగి వద్ద ఉన్న జిపిఎఫ్ మొత్తానికి సంబంధించి అతను దాఖలు చేసిన నామినేషన్ ప్రకారం అది నామినీకి చెల్లించబడుతుంది.
8] ఉద్యోగి అదృశ్యమైన తేదీ నుండి ఒక సంవత్సరం గడిచిన తరువాత, కుటుంబ పెన్షన్ మరియు పదవీ విరమణ గ్రాట్యుటీ ప్రతిపాదనలు కుటుంబం నుండి దాఖలు చేయించాలి.
9] ఉద్యోగి అదృశ్యం గురించి ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన తేదీ నుండి ఏడు సంవత్సరాల తరువాత, అర్హతగల కుటుంబ సభ్యుని నుండి కారుణ్య నియామకం దరఖాస్తు అనుమతించబడుతుంది.
( GOMsNo.378, GAD (SER.A) dept.dt.24-08-99)
10] కారుణ్య నియామకం కోసం దరఖాస్తును పరిగణనలోకి తీసుకునేటప్పుడు ఉద్యోగి అదృశ్యం గురించి కొత్త పోలీసు నివేదికను ఖచ్చితంగా పొందాలి.
11] కారుణ్య నియామకం కోసం దరఖాస్తు ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన తేదీ నుండి ఏడు సంవత్సరాలు పూర్తయిన తేదీ నుండి ఒక సంవత్సరం లోపల ప్రతిపాదించబడాలి.
12] ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన తేదీ నుండి పదవీ విరమణ చేయడానికి 7 సంవత్సరాల సేవ కంటే తక్కువ సర్వీస్ కలవారికి ఈ ప్రయోజనం వర్తించదు.
13] మోసం చేసినట్లుగా అనుమానించబడిన వారు, ఏదైనా ఉగ్రవాద సంస్థలో చేరినట్లు అనుమానిస్తున్నారు,
లేదా విదేశాలకు వెళ్లినట్లు అనుమానిస్తున్న సందర్భంలో కారుణ్య నియామకం దరఖాస్తు పరిగణించబడదు.
14] కారుణ్య నియామకం సమయంలో ఉద్యోగి తరువాతి తేదీలో ఎక్కడైనా సజీవంగా ఉన్నాడని నిరూపణ అయితే కారుణ్య నియామకం పొందిన వ్యక్తి యొక్క సేవలు నిలుపుదల చేయబడతాయని అంగీకార పత్రం తీసుకోవాలి.
15] ఉద్యోగి అదృశ్యం గురించి ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన తేదీ నుండి 7 సంవత్సరాలు పూర్తయిన తర్వాత GIS, TSGLI మరియు భీమా క్లెయిమ్‌లు పరిష్కరించబడతాయి.
0 Comments
Please do not Enter any Spam link in the Comment Box