ZP/GPF PART FINAL WITHDRAWAL
🔥ZP/GPF పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్🔥
🌸చందాదారుడు 20 సం॥ సర్వీసు పూర్తిచేసినా, లేక పదవీ విరమణ చేయడానికి 10 సం॥
మిగిలివున్న ఉద్యోగి తన GPF ఖాతా నుండి పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ చేసుకోవడానికి అనుమతి
మంజూరుచేస్తారు రూల్ -15A
🌸గృహసంబంధ అంశాల విషయంలో ఉద్యోగి 15 సం॥ సర్వీసు పూర్తిచేసినా పార్ట్
ఫైనల్ విత్ డ్రాయల్ తీసుకోవడానికి అర్హత కలదు.
💥పదవీ విరమణ పొందడానికి చివరి 4 నెలల సర్వీసులో ఎటువంటి PART FINAL WITHDRAWAL అనుమతించబడదు కాని కొన్ని ప్రత్యేక సందర్భాలలో అనుమతించవచ్చును.
(G.O.Ms.No.98 తేది:19-06-1992)
🌸సాధారణంగా 6 నెలల తరువాతనే రెండవ పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ అనుమతించాలి లేక ఒక
ఆర్ధిక సం॥లో రెండు కంటే ఎక్కువ PART FINAL WITHDRAWAL మంజూరు చేయరాదు రూల్-15B
🌸ZP/GPF PART FINAL WITHDRAWAL తీసుకుంటే
ఎటువంటి రికవరీ ఉండదు.
🌸ZP/GPF PART FINAL WITHDRAWAL దరఖాస్తును
అపెండిక్స్-O లో సమర్పించాలి.
🌸ఉద్యోగి పదవీ విరమణ చేసినా,లేక ఉద్యోగానికి రాజీనామా చేసినా లేక
మరణించినా అతని ఖాతాలో నిల్వ ఉన్న మొత్తం అతనికి,అలాగే ఉద్యోగి చనిపోతే అతడు సమర్పించిన
నామినేషన్ ప్రకారం కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. నామినేషన్ లేని సందర్భాలలో అర్హత
కలిగిన కుటుంబ సభ్యులందరికీ సమాన వాటాల ద్వారా చెల్లిస్తారు రూల్-28,29,30
🌸GPF PART FINAL WITHDRAWAL , FINAL WITHDRAWAL బిల్లులను ఫామ్-40 లో దాఖలు చేయాలి. అలాగే ఫామ్-40A కూడా జతపరచాలి.
🌸జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలల్లో పనిచేయు ఉద్యోగులకు ప్రధానోపాధ్యాయులు, మండల పరిషత్
పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు మండల విద్యాధికారి పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్
మంజూరుచేసి ఫాం-40 తో పాటు జిల్లాపరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారికి పంపి సదరు
సొమ్మును ఉపాధ్యాయులకు చెక్కు ద్వారా చెల్లిస్తారు
ప్రస్తుతం ఆన్లైన్ పేమెంట్ ద్వారా
బాంక్ క్రెడిట్ చేస్తున్నారు
(G.O.Ms.No.447 Dt:28-03-2011)
0 Comments
Please do not Enter any Spam link in the Comment Box