అసమర్థుడైన రాజు - కుందేలు రాజు:
⇲ ఒకసారి కుందేలుకు ఒక కోరిక పుట్టింది - తను అడవికి రాజునైతే బాగుండుననిపించింది. ‘ఎప్పుడూ సింహమే రాజు ఎందుకు అవ్వాలి? రాజవ్వటం అనేది వంశపారంపర్యం కాకూడదు. సింహమూ, దాని కొడుకూ, మళ్ళీ దాని కొడుకూ - ఇదే క్రమం అయితే మిగతా జంతువులకు అవకాశం రాదు గదా!’
⇲ అయితే సింహం చిరునవ్వు నవ్వింది. "అవును మిత్రమా, మరిచాను. ప్రజాస్వామ్య భావజాలం పరుచుకున్న ఈ రోజుల్లో మేం ఇంకా ఇలా రాజసింహాసనాన్ని అంటిపెట్టుకు కూర్చోవడం బాగాలేదు. నీకే ఇస్తున్నా మొదటి అవకాశం. ఈ క్షణం నుండీ ఈ అడవి మొత్తానికీ సర్వం సహా చక్రవర్తివి నీవే. నేను నీకు వెన్నుదన్నుగా రాజ్యరక్షణ భారం వహిస్తాను."
⇲ "అదికూడా అవసరం లేదు మిత్రమా! అన్నది కుందేలు రాజోచితంగా." రాజ్య రక్షణ ఇకపై మా బాధ్యత. మీరు అంత:పురంలో విశ్రాంతి తీసుకోండి, లేదా వనాంతాలకు వెళ్ళి తపస్సు చేసుకోండి."
⇲ సభలోని వారికి ఎవరికీ నోటమాట రాలేదు. సింహం గద్దె దిగుతూ" ప్రజలారా! ప్రజాస్వామ్య భావనలను గౌరవిస్తూ మేం రాజపదవి నుండి తప్పుకొని, కుందేలుకు తొలి అవకాశం ఇచ్చాం. మీరంతా రాజౌన్నత్యాన్ని గౌరవిస్తూ మీ కొత్త రాజు పట్ల విదేయులుగా వర్తిస్తారనీ, వనశాంతిని సంరక్షించడంలో మీ బాధ్యతల్ని గుర్తించి మసులుకుంటారనీ ఆశిస్తున్నాను" అని ముగించి నిష్క్రమించింది.
⇲ అందరూ కుందేలు మహారాజుకు జయం పలికారు. కానీ ఎవరికివారు నోళ్లు నొక్కుకున్నారు. ముఖ్యంగా పులి సేనాపతీ, గుంటనక్క మంత్రీ నోరు మెదపలేదు. వాళ్ళిద్దరూ చాలా రోజులుగా రాజ్యాన్ని కబళించే యోచనలోనే ఉన్నారు. ఇప్పుడు సింహమే తమ మార్గాన్ని సుగమం చేసింది! కుందేలు పని ముగించటం ఎంతసేపు? ఇలా సాగుతున్నాయి వాటి ఆలోచనలు.
⇲ ఆ రోజు రాత్రి కుందేలుకు నిద్రపట్టలేదు. ప్రపంచం అంతా కొత్తగా అనిపిస్తోంది. తను తీసుకురావాల్సిన మార్పులు ఏమున్నాయని ఆలోచిస్తుండగానే తెల్లవారింది. అంతలోనే అంత:పురం గగ్గోలెత్తింది. పులి సేనానీ, గుంటనక్క మంత్రీ తిరుగుబాటు చేశారు. తమ బలాలతో కోటను పూర్తిగా ముట్టడించారు.
⇲ కుందేలు మహా రాజు అత్యవసర సమావేశం నిర్వహించింది. పులికీ, నక్కకూ తానే స్వయంగా బుద్ధి చెబుతానన్నది. జన నష్టం తనకు ఇష్టంలేదు కనుక , ఒక్క ఏనుగుపైనెక్కి తాను తన ప్రతాపం చూపిస్తానన్నది.
⇲ ఏనుగు పూర్తిగా తయారై, రాజుగారిని అంబారీమీద ఎక్కించుకొని, కోట తలుపులు తెరిచి, ముందుకు ఉరికింది. ఎదురుగా పులీ, నక్కా తమ సైన్యాలను మోహరించి నిలబడి ఉన్నాయి. ఏనుగు వాటికి ఎదురుగా నిలబడి, కుందేలు మహారాజు వేస్తానన్న శరపరంపరలకోసం ఎదురుచూస్తున్నది.
⇲ కానీ ఆశ్చర్యం! ఒక్క బాణమూ రాలేదు! ఏనుగు తొండంతో తన వీపును తడుముకొని చూసింది. అక్కడ కుందేలు మహారాజు లేడు. శత్రుమూకల శబ్దానికి వెరచి ఏనాడో పలాయన మంత్రం పఠించారు వారు!
⇲ బిక్కచచ్చిపోయిన ఏనుగు ప్రళయకాల ఘర్జనలా వినవచ్చిన సింహనాదంతో అకస్మాత్తుగా మేలుకున్నది. తన పక్కనే నిలబడి సింహం భీకరంగా గర్జిస్తున్నది. శత్రుసైన్య సమూహం ఆ గర్జనకు కకావికలై దారీతెన్నూ తెలీకుండా పరుగులు పెడుతున్నది! సింహం వారిని తరిమి, అందినవారిని అందినట్లు విసిరేస్తున్నది.
⇲ పులి సేనానీ, గుంటనక్క మంత్రీ ఇక ఎవ్వరికీ కనిపించలేదు.
⇲ కుందేలు కూడానూ!
⇲ తిరిగి అడవిని సింహమే పరిపాలించవలసి వచ్చింది.
⇲ అసమర్థులైన రాజులు రాజ్యానికి వన్నె తేలేరని అందరికీ మరోసారి
తెలిసివచ్చింది.
ENGLISH TRANSLATE
Once the rabbit had a wish - he seemed to be the king of the jungle. Why ever to be a lion king? Reigns should not be hereditary. The lion, its son, and its son again - this is the same sequence, but the rest of the animals are unlikely!
After thinking for a few days, it can no longer move. The lioness went to the darbar and asked - "Lionguru! You are never good enough to give yourself to the jungle. That.
All of the members of the House were upset. The whole house trembled silently. They all breathed a sigh of relief that the lion would be punished for the crime of treason.
But the lion's smile is smiling. "Yes, my friend, nowadays, we are not good enough to cling to the throne of democracy today.
That's not even necessary, friend! That's rabbit royalty." Kingdom protection is no longer our responsibility. You can: Relax in Puram, or go to Vanathanth and do penance.
None of the members of the House were aware of it. The lion's fate Respecting democratic ideals, we broke away from Rajapaksa and gave the rabbit the first chance. I hope that all of you respect the kingship and apply to your new king, and hope that you will recognize your responsibilities in protecting the queen.
Everyone wins the rabbit king. But to whom the mouths were pressed. The tiger Senapati in particular, the mouth of Guntanakku Mantri did not open. Both of them have been planning to ruin the kingdom for several days. Now the lion has paved their way! How long does the rabbit finish? These are their thoughts.
Rabbit could not sleep that night. The whole world seems new. White was thinking about what changes he should bring. That's all: Puram giggled. Puli Senani and Guntanakka Mantri rebelled. The fort was completely besieged by their forces.
The rabbit king held an emergency meeting. Pulicky, fox, he says, himself. Since he did not like the loss of the population, he would grieve over one elephant.
The elephant was fully prepared, mounted on the king's palace, and the castle doors were opened and hung. On the opposite side, the tiger and the fox are standing on their armies. The elephant stood in front of them and waited for Sarabaramparala, the king of the hare.
But surprise! Not an arrow came! The elephant saw its back with a thumb. There was no rabbit king. They are chanting the sound of hostilities and chanting the escape chant!
Suddenly awakened by the throne, which sounded like a rumbling elephant roaring. Standing beside him, the lion roared fiercely. The hostile army is taking over the rooftop and running out unaware! The lion is chasing them and throwing the receivers away.
Puli Senani, Guntanakka Mantri is no longer seen.
Rabbit too!
The lion had to rule the jungle again.
It was once again revealed that incompetent kings were not capable of coming to the Kingdom.
0 Comments
Please do not Enter any Spam link in the Comment Box