Bandhalaku Duram - Thappalenchadam - A Good Story

బంధాలకు దూరం - తప్పులెంచడం  

మంచి నీతి కథ

 వంట చేసిన అమ్మను ...వంట బాగా లేదని..ఎప్పుడు...నిందిచకూడదు.....

 ఎందుకంటే... చాలా మందికి...తినడానికి అన్నం లేదు....కొందరికి అస్సలు అమ్మ కూడా లేదు......

➽ రాత్రి తొమ్మిదవుతోంది నాన్న భోజనానికి కూర్చున్నారు. ఆయన రాత్రిపూట అన్నం మానేసి చాలారోజులైంది. ఒక చపాతీ, గ్లాసు పాలు మాత్రమే తీసుకుంటున్నారు. అమ్మ చపాతీ పెట్టి, పళ్లెంలో కూర వేస్తోంది. నాన్నతో ఏదో మాట్లాడుతూ ఆ పళ్లెం వైపు చూశాను. చపాతీ కాస్త మాడింది. నాన్న తినేదే కొంచెం.. అది కాస్తా మాడింది. ఇప్పుడు ఆయన అమ్మనేమంటారోనని భయపడ్డాను. కానీ, ఆయన ఏమీ అనకుండా నాకు కబుర్లు చెబుతూ ఆ చపాతీ తినేశారు. ఆయన చేతులు కడుక్కునేటప్పుడు అమ్మ అంది.. ‘‘ఏంటో ఇవాళ.. మంట ఎక్కువ పెట్టినట్టున్నాను. రొట్టె మాడిపోయింది. మళ్లీ చేయబోయేలోపు మీరు భోజనానికి వచ్చేశారు.. అందుకే అదే వడ్డించాను’’! ‘‘అలా బాగా కాలిన చపాతీ అంటే నాకు చాలా ఇష్టం. నువ్వే ఎప్పుడూ పెట్టవు’’ అంటూ నాన్న నవ్వుతూ బదులిచ్చారు. నాకేమీ అర్థం కాలేదు.

➽ నాన్న ఇవతలికి వచ్చాక అడిగాను.. ‘‘చపాతీ నల్లగా అయిపోయింది కదా నాన్నా.. మీకు నిజంగానే అలాంటిది ఇష్టమా’’!

 ఆయన నన్ను ఒడిలోకి తీసుకుని ఏమన్నారో తెలుసా! ‘‘ఇంటిపనులతో మీ అమ్మ రోజంతా తీరిక లేకుండా కష్టపడుతూ ఉంటుంది. ఆ హడావుడిలో చపాతీ మాడింది. ఈ పూటకి దాన్ని తినడం వల్ల నాకు పెద్ద ఇబ్బందేమీ ఉండదు. అదే అమ్మను కోప్పడితే.. ఆ బాధ తనకెప్పటికీ ఉంటుంది కదా. అయినా, అవతలి మనిషిలో తప్పులెంచడం మొదలుపెడితే ఏ బంధాలూ నిలబడవు’’!...

➽ మనిషిలోని సుగుణాలలతో పాటు దుర్గుణాలను ప్రేమించినప్పుడే , మనిషితో బంధం నిలబడుతుంది.

➽ ఏ వ్యక్తి కూడా పూర్తిగా 100% Mr. Perfect కాదు .

 


Post a Comment

0 Comments