Era for the growth of man - not greed

మనిషికి ఎదుగుదలకు ఎరా - కాకూడదు అది దురాశ

వేరు  వేరు  వేరుశెనగలు - దీన్ని తెలంగాణాలో ఆపచ్చన అంటారు 


✌ వేటగాడు, ఒక చెక్క డబ్బాని కోతులు ఉన్న చెట్టుకు తాడుతో కట్టేస్తాడు. డబ్బాలో ఒక వేరుశెనగకాయని పెట్టి, హాయిగా నిద్రపోతాడు.

✌ ఆ చెక్క డబ్బా అన్ని వైపులా మూసివుంటుంది. పైన ఉన్న చెక్కకి మాత్రం ఒక రంధ్రం ఉంటుంది. కోతి చెయ్యి దూరెంత రంధ్రం....

 ఆ రంధ్రం లోకి కోతి చెయ్యి దూరుస్తుంది....కానీ ఆ రంద్రం వేరుశెనగకాయని పట్టుకున్నాక దాని పిడికిలి బయటకు రానంత చిన్నదిగా ఉంటుంది. చెయ్యి బయటకి రావాలంటే కోతి తన పిడికిలి వదలాలి. అయితే వేటగాడు తనని పట్టుకోడానికి వస్తున్నా అది ఆ వేరుశెనగకాయని వదలదు. పిడికిలిని ఇంకా గట్టిగా బిగిస్తుంది. దాంతో వేటగాడి చేతికి చిక్కుతుంది.

✌ వేరుశెనగకాయ మీద ఉన్న ఆశ వల్ల కోతి తన జీవితాన్నే పోగొట్టుకుంటుంది. మనిషి కూడా అలాంటి వాడే. లోకంలో వేరు వేరు రూపాల్లో వేరుశెనగలు ఉంటాయి. వాటిమీద మొహంతో మనం మన జీవితాలనే పోగొట్టుకుంటూ ఉంటాము.

✌ డార్విన్ సిద్ధాంతం ప్రకారం మనం అందరం కోతుల్నించి రూపాంతరం చెందినవారమే. తేడా ఎక్కడంటే వేరుశెనగ కాయ దగ్గరే. జీవితంలో మనక్కూడా చాలామంది వేటగాళ్ళు వేరుశెనగ కాయలు చూపిస్తూ వుంటారు. ఉద్యోగికి ప్రమోషన్ వేరుశెనగ, కొందరికి లంచం వేరుశెనగ, మరికొందరికి అత్యధిక వడ్డీ వేరుశెనగ, మరికొందరికి పేకాట వేరుశెనగ...  యువతకు వ్యామోహం వేరుశెనగ.

  ✌ ఏదో సాధించాలని పిడికిలి బిగించడం మంచిదే... కానీ విడుపు లేకుంటే ఒక్కొక్కసారి జీవితాన్నే కోల్పోతాం.

 ✌ ఈ వేరుశెనగ దురాశే కానక్కర్లేదు, డబ్బు సంపాదన అనే వేరుశెనగ కోసం కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడమూ ఇదే కోవలోకి వస్తుంది. 

 ✌ ఇప్పటికైనా పిడికిలి తెరుద్దామ్. ప్రేమగా చేతులు చాచుదాం.

 సర్వేజనా సుఖినో భవంతు


Post a Comment

0 Comments