Mahabharata - Panchamaveda

మహాభారతం - పంచమ వేదం 

సు'మనభారతం : 

 సుమన్ బాబు  కట్కo గారి మాట :

            మహాభారతం ఓ అద్భుతం . జీవన గమనంలో వేసే అడుగులకు బాటను చూపే దీపం . జీవితం సుఖమయం కావాలనే కోరిక , కష్టాలమయం అనే నిర్లిప్తత అందరిలో .. ఏదో దశలో ... సరిగ్గా ఆ దశలో దిశ మహాభారతం . కానీ మన ఇంటింటి భారతం మహా భారం అయ్యింది . మన నుంచి దూరంగా ఎందుకు ? వెళ్తుంది . కృష్ణా ! రామా !!  అనే వయసులో చదివేదిగా ఎందుకు ముద్ర పడింది ?

                నిజానికి జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ,కష్టాలను ఎదుర్కొనే ధైర్యం, మానసిక స్థైర్యం మహాభారత గుణం . మనకు బలం . కష్టాలూ , కన్నీళ్లులేని జీవితాన్ని కోరుకోవడం పిరికితనం . వాటిని ఎదుర్కొనే గుండెధైర్యం పిడుగు'ధనం . జీవిత పయనంలో గొళ్ళాలు , బళ్లాలు ఎదురవ్వడం సహజం . వాటిని సమర్థంగా ఎదుర్కోవడమే సమరం . ఈనాటి యువత ఆ సమరాన్ని ఎందుకు చేయలేకపోతుంది . లెక్కల్లో జీవితాలు, బహుతిక్క భౌతికంలో , ప్రేమలో కెమిస్ట్రీ తో ఆగిపోవడమే మిస్టరీనేమో !


జీవితాన్ని చదవకపోవడం , అర్థం చేసుకోలేక , చేయించలేకనే ఈ ప్రాణ అర్పణాలేమో !!

              ఫస్ట్ ర్యాంక్ కొరకు పోరాడిన కర్ణార్జునులు సైతం అభిమన్యులుగా మిగులుతుంన్నారెందుకో ! రాకను స్వాగతించి పోకను జీర్ణించుకోలేని గతించడమో !! దీనికి సరైన ఏది మార్గదర్శనం కాగలదు  !? మహా భారతం దూరం తగ్గించదు కానీ భారాన్ని దూరం చేస్తుందని ఎందుకు తెలుసుకోలేక పోతున్నాం ?

             భీష్ముని ప్రతిజ్ఞలో అధికారాన్ని పక్కనపెట్టే బాధ్యతను చూడగలం . ధృతరాష్ట్రునిలో తండ్రి గుడ్డి ప్రేమని , దుర్యోధనునిలో గుణంలేని , ఘనంకానీ కొడుకుని ... కర్ణునిలో ఉన్నతం కోసం తపన , అర్జునునిలో ఉన్నంతలోనే ఉత్తమం , అభిమన్యునిలో కడవరకు జీవనపోరాటం స్ఫూర్తిని కలిగిస్తాయి . ద్రౌపదీ , అంబాదేవి పగ , ద్రోణ-  ద్రుపదుల ప్రతీకారం ,ఆ దాయాదుల దౌర్బాల్యం మన  దౌర్బాగ్యం కాకుండా ఉండే సోయిని అందిస్తుంది .

             అన్నదమ్ముల మమకారం , శ్రీకృష్ణుని ముందుచూపు , శకుని కుంటిసాకులు , తప్పటడుగులు , తప్పుటెత్తులు స్వార్థాలు , త్యాగాలు ,గుణాలు , ఘనాలు ,బలాలు , బలహీనతలు ఎట్ల బత్కాల్నో , ఎట్లా బతకకూడదో నేర్పిస్తాయి .బతకడం ఎంత ముఖ్యమో తెలుపుతాయి . దైర్యంగా సమస్యలను ఎదుర్కొనే దిశగా మలుపుతాయి .

                యుద్ధం చేయడాన్ని నేర్పిస్తుంది . ఎందుకు చేయకూడదో నేర్పుతుంది . ఎలా సాగాలో , ఎక్కడ ఆగాలో , ఎప్పుడు ఆడాలో , ఎప్పుడు కూడదో చూపిస్తుంది .జీవితాన్ని ఎలా చూడాలీ? అనే చూపునిస్తుంది . తిట్టుకోవడం , తట్టుకోవడం , పట్టుకోవడం ఎందుకో తెలుస్తుంది .తిండికి లేకపోతే ఎట్లుంటది ?, తిన్నది అరగకపోతే ఏమైతదో అర్థమైతది .

శంతన అకాల వివాహ కష్టం

సత్యవతి అధర్మ స్వార్థం

భీష్మ అవివాహ  నష్టం

చిత్రాంగద-విచిత్రవీర్య బాధ్యతారాహిత్యం 

అంబాదేవి కక్ష  లక్షణం

అంబికా-అంబాలిక వైధవ్యం 

దృతరాష్ట్ర గుడ్డి ప్రేమ

పాండురాజు అన్నప్రేమ 

విదురనీతులు

శకునిగోతులు

గాంధారి గుడ్డితనం

కుంతీదేవి దయాగుణం 

ద్రోణాచార్య శిష్యకపటం

ద్రుపద  స్నేహవికటం

కర్ణ వివక్షా విపక్షం

ఏకలవ్య అర్పితం 

యుధిష్ఠిర అసహజ ధర్మ వ్యసనం

దుర్యోధన అధర్మ అధికార లాలసం 

భీముని కండబలం

అర్జునుని అండ శరం

నకులసహదేవ సర్వామోదితం

ద్రౌపది జన్మ రహస్యం  

దుశ్శాసన మానసిక దౌర్భల్యం 

అశ్వత్థామ అ'క్రమ క్రోధం 

అభిమన్యు అసాధారణ ఉక్రోషం 

బలరామ అతిసాధారణ ఆక్రోశం

శ్రీకృష్ణుని దిశానిర్దేశం

కురుక్షేత్ర యుద్ధ ఫలితం ..

వెరసి ..

తరచి చూస్తే !

...............................

సమస్యా వేదనం 

పరిష్కార శోధనం

పంచమ వేదం

మహాభారతం

...............................

వ్యాసభారతం అర్థంచేసుకునే శక్తిలేదు  ఆకళింపు చేసుకున్నాననే అహంకారమూ లేదు

యువత మనోదౌర్బల్యం తగ్గిచాలనే ఆశ

మనోదైర్యం అందించాలనే ఆశయం 

తప్పులు లేవని అనుకోవడం లేదు

సూచిస్తే సవరిస్తామని , ఆ వరం మీరు ఇవ్వాలని ఆశతో ...

...............................

నాకు కలాన్నిచ్చిన తల్లిదండ్రులకు ...

దానికి బలాన్నిచ్చిన గురువులకు ... 

సహకారం అందించిన  ఉమ్మడి కుటుంబానికి ...

ముఖఃస్తుతి కొట్టక సవరించిన ఆత్మీయ మిత్రబృందానికి ...    

   నమః సుమనాంజలులతో ...

                                                                                            మీ ...

                                                                                                               సుమన్ బాబు . కట్కo.

                                                                                                                        (వాట్స్ ఆప్ )


Post a Comment

0 Comments