Precautions to be taken before taking home and space

ఇల్లు , జాగ తీసుకునేముందు తీసుకోవలసిన జాగ్రత్తలు 

Precautions to Buy Plats & Homes

👌స్థలాలు లేదా ఇల్లు కొని లేదా అమ్మినప్పుడు నమ్మకంగా మన పక్కనే ఉండే Brokers ( కొంత మంది  మాత్రమే)

👌వాళ్ళు చేసే మోసాలు. చాలా మంది తెలియక మోసపోతూ ఉంటారు వారికోసం ఇది.

👌 ముందుగా Brokers  ( కొంత మంది  మాత్రమే) చేసే మోసాలు

👌 స్థలం కొనేటప్పుడు తప్పుడు వివరాలు ఇస్తారు. 100% వాళ్ళ మాటలు నమ్మవద్దు. సంపాదించడం చేతకాని వాళ్ళు ఇలాంటి తప్పుడు మాటలు చెప్పి సంపాదిస్తారు. ఎంగిలి మెతుకులు కోసం ఆశ పడే వారు ( కొంత మంది కి మాత్రమే)

👌2% Commision తీసుకుంటారు. బేరం మాట్లాడేటప్పుడు ఎక్కువగా  brokers వస్తారు. మనలని రెచ్చ కొట్టి ఎక్కువ రేట్ కి కొనే విధముగా చేస్తారు.

👌నిజ యజమానిని తీసుకురాకుండా నకిలీ వాళ్ళని తీసుకొచ్చి బేరం చేస్తారు.

👌ఆస్తి ఎవరి పేరు మీద ఉందొ తెలుసుకోవాలి అంటే  #registration #website నుండి మనమే  #Easy గా తీసుకోవచ్చు. #No #FEE.

👌 కొనే ముందు #Original #document లో ఉండే యజమాని #photo చూడండి. అన్ని #links documents history చూడాలి.

👌ఎట్టి పరిస్థితుల్లో ఒప్పంద పత్రం  3 నెలలుగా  ఉండేలా చూడండి. మీ దగ్గర డబ్బు ఉన్న 3 Months తక్కువ వెయ్యవద్దు. ఏ రోజు ఏమి జరుగుతుందో తెలియదు. Agreement amount  5-10% కన్నా ఎక్కువ ఇవ్వవద్దు. Agrement cancel చేస్తే తిరిగి ఇవ్వకుండా బాగా తిప్పుకుంటారు.

👌 ఎప్పుడు కూడా #Document లో ఉండే యజమాని ఫోటో చూసే అతనితోనే మనం బేరం మాట్లాడాలి. వీలయితే Brokers కు తెలియకుండా కూడా ఒక్కసారి అతనితో మాట్లాడిచూడాలి ఏవైనా సందేహలున్నప్పుడు .

👌 మీరు కొనే స్థలం , వాటి డాకుమెంట్స్ #address నిజమో కాదో తెలుసుకోండి. ఎక్కడో ఉన్న స్థలం డాకుమెంట్స్ తో  మంచి area లో ఉన్న స్థలం చూపించి మోసం చేస్తారు. మీరు అనుకున్న స్థలం orginal స్థలాలు వేరుగా ఉంటాయి.

👌 original స్థలం size, document స్థలం size లో తేడాలు ఉంటాయి.

Documents required for Property:

1) Main Owner Sale Deed document original, ఒరిజినల్ పేపర్స్ మీద stamp చూడాలి.

2) All Linked Documents

3)  అన్ని డాకుమెంట్స్ లో కొనేవారు, అమ్మేవారు ఒక్కరు కాకపోతే అమ్మేవాడి Family tree certificate ( తండ్రి చనిపోతే పిల్లలు స్థలం ఆమ్మితె లేదా వరాసత్వముగా వచ్చే ఆస్తి ఐతే)

4) Documents front page లో ఏదయినా court seal, sign ఉంటే property మీద case ఉన్నది అని అర్థం.

5) EC - Encumbrance certificate (EC)

6) #Mother deed certificate

7) #RTC - Record of Rights, Tenancy and Crops (For Agriculture Land)

8.) Survey Sketch

9) #Layout Approval

10) #Katha Certificate

11) #DC #Conversion certificate ( agriculture to Non-Agriculture land conversion)

12) #Property Tax Certificate

13) SC, ST సోదరులకు ప్రభుత్వామ్ ఉచితముగా స్థలాలు ఇచ్చినది. అటువంటి స్థలాలు కొన్న మళ్ళీ వారికే వెళ్తాయి, రిజిస్ట్రేషన్ చెల్లదు.

14) పేద వారికి ప్రభుత్వామ్ ఉచితముగా స్థలాలు ఇచ్చినది, అటువంటి స్థలాలు కొనకూడదు.

15) #apartments ఐతే plan approval, OC, CC ఉండాలి. 3Floors కి plan approval తీసుకొని 4 or 5 floors కడతారు. వాళ్ళు బ్యాంక్ వాడితో link పెట్టుకొని మీ లోన్ easy గా చేపిస్తారు resale అప్పుడు problem అవుతుంది.

👌 మనతో మంచిగా నటిస్తూ మనం అనుకునే మాటలని brokers చెప్తూ #commission తీసుకుంటారు. వాళ్ళతో జాగ్రత్త.

👌 స్థలం కాగితాల copys ఎట్టి పరిస్థితులలో ఎవరికి ఇవ్వకండి. ఆ copy #paper ఇతరుల దగ్గర ఉండటం వల్ల మనకి చెడు చేసే అవకాశం ఎక్కువ.

👌ఇల్లు కట్టి ఉంటే #building #Plan #approval ఉండాలి.

👌Agrement రోజు, #Registration ముందు రోజు  EC తీయండి. కొంత మంది వేరే వాళ్ళకి అమ్మి మన దగ్గర Agrement వేస్తారు. EC లో స్థల యజమాని ఎవరో , ఎప్పుడు కొన్నారు, ఎవరి దగ్గర కొన్నారు ఉంటాయి.

👌ఆ ల్యాండ్ పైన ఎమైనా విద్యుత్ lines ఉన్నాయా, ల్యాండ్ క్రింద ఎమైనా #underground #drainage ఉన్నదా.  #Land govt ప్రజా అవసరాలకు తీసుకుంటున్న కోనకూడదు.

👌ఇప్పుడు Online Registration process ఉన్నది. 15Years back online లేదు ఆ time లో ఒకే property ని ఎక్కువ మంది పేరుతో రిజిస్టర్ చేశారు మోసం చేసి.

👌 మీరే నెను కింద ఇచ్చిన గవర్నమెంట్ వెబ్ సైట్ లో స్వయంగా మీరే చూసి తెలుసుకోండి. మీరు కోనాలనుకున్న, లేదా కోనుకున్న స్థలం, ప్లాట్ భూమి ఎదైనా కావచ్చు. దానికి సంబంధిత ఈసి, అది ప్రబుత్వ స్థలమా పోరంబోకు స్థలమా పట్టా ఉన్న స్థలమా అనేవి ఇందులో పోందుపరచిఉంటాయి. మీ ప్లాట్, భూమి కి సంబంధిత రిజిస్ట్రేషన్ వివరాలు తెలుసుకోవచ్చు లింక్ డాక్యుమెంట్స్ తో సహా. మీ ప్లాట్ కోలతలు హద్దులు ఎవరి నుంచి ఎవరికి హక్కుగా సంక్రమించింది తదితర వివరాలు ప్రింటుతో సహా ఉచితంగా తిసుకోవచ్చు. మీరుకోనే భూమి, ప్లాట్ రిజిస్ట్రేషన్ విలువ ఎంత తదితర వివరాలకు సైతం ఈ వెబ్ సైట్ చాలా చాలా ఉపయోగం. మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధిత రిజిస్ట్రేషన్ సైట్స్.

http://registration.ap.gov.in/

http://registration.telangana.gov.in/


Post a Comment

0 Comments