SGT's -24 Years Scale -Loss their Benfits

-:SGT లు 24 Year Scale ద్వారా నష్టపోకండి :-

SGT's 24Years Scale

👌ముఖ్యంగా SGT లు దీనిపై సరైన అవగాహన లేకపోవడం వలన ఆర్థికంగా నష్టపోతున్నారు

👌24 year స్కేల్ తీసుకున్న తర్వాత ప్రమోషన్ వస్తే ...

👌ప్రమోషన్ ద్వారా రావలసిన రెండు ఇంక్రిమెంట్లు రావు. ఒక్క ఇంక్రిమెంటు మాత్రమే వస్తుంది.మరియు తదుపరి కొత్త కేడర్ లో AAS అంటే 6-12-18 స్కేళ్ళు రావు

👌 ఎవరైనా  SGT లు పదోన్నతి పొందే అవకాశం ఉన్నవారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి

👉 మరో ముఖ్య విషయం:-

👌 24 సంవత్సరాలు #Service పూర్తి చేసుకుని, డిపార్ట్మెంటల్ పరిక్షలు ఉత్తీర్ణత పొంది ఉంటే అప్పుడు కూడా మనకు 24 year scale తీసుకోవాలని నిర్బంధం ఏమీ లేదు

👌మనం DDO కు 24 స్కేలు కావాలని లెటర్ ఇస్తేనే అది మంజూరు చేస్తారు. అది రెగ్యులర్ ఇంక్రిమెంటులాంటిది కాదు

 👉 ఒక ఉదాహరణ చూద్దాం:-

 👌 A అనే వ్యక్తి 25 సంవత్సరాలు #SGT గా పనిచేసి తధుపరి పదోన్నతి తీసుకున్నాడు అనుకుందాం

👌  A తన సర్వీసులో 24 స్కేలు తీసుకుంటే అప్పుడు ఒక్క ఇంక్రిమెంటు వచ్చింది. పదోన్నతి వచ్ఛినపుడు మరొక ఇంక్రిమెంటు వచ్చింది.

👉 మొత్తం రెండు ఇంక్రిమెంట్లు వచ్చాయి

 👌 A కు ఇంకా 12 సంవత్సరాల సర్వీసు ఉంది. అతడు 6 సంవత్సరాలకు, 12 సంవత్సరాలకు పొందవలసిన రెండు ఇంక్రిమెంట్లు నష్టపోయాడు

👌 B అనే టీచరు కూడా A తో పాటు సర్వీసు లోకి వచ్చి అతడి లాగే 25 సంవత్సరాల తరువాత పదోన్నతి పొందాడు అనుకుందాం

👌 B మాత్రం 24 సంవత్సరాల స్కేలు వద్దని అధికారులకు తెలిపి తీసుకోలేదు. అతడు పదోన్నతి వచ్చినపుడు 2 ఇంక్రిమెంట్లు పొందాడు. 6 , 12 సంవత్సరాలకు AAS కింద మరో రెండు ఇంక్రిమెంట్లు పొందాడు

👉  మొత్తం 4 ఇంక్రిమెంట్లు B పొందాడు

👌 A అనే టీచర్ B తో పోల్చుకున్నప్పుడు -  A అనే టీచర్ B కంటే రెండు ఇంక్రిమెంట్లు తక్కువ తీసుకున్నాడు.

👌 కావున  #SGT సర్వీసు ఎక్కువ ఉన్నవారు సరిగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోగలరు


Post a Comment

0 Comments