KALESHWARAM BARRAGE FULL DETAILS
👇 చాలా మందికి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంటో తెలియదు..
👇 ఇది ఒక రిజర్వాయర్ అనుకుంటున్నారు..
👇 వాళ్ళ కోసం డిటైల్డ్ గా పూర్తి వివరాలతో
👉 కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. మొత్తం 3 బ్యారేజీలు, 1531 కి.మీ. గ్రావిటీ కెనాల్స్, 203 కి.మీ. టన్నెల్స్, 19 పంపు హౌస్‌లు, 20 రిజర్వాయర్లు మొత్తం 147 టీఎంసీల సామర్థ్యంతో మొత్తం 45 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిచే ప్రాజెక్ట్.
👉కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన 3 బ్యారేజిలలో మొట్టమొదటిది లక్ష్మి (మేడిగడ్డ) బ్యారేజి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో గోదావరి నదిపై 16.17 టీఎంసీల సామర్థ్యంతో, 1.6 కిలోమీటర్ల పొడవుతో, 85 గేట్లతో నిర్మించారు.
👉 కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మించిన 3 బ్యారేజిలలో రెండవది సరస్వతి (అన్నారం) బ్యారేజి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో గోదావరి నదిపై 11.9 టీఎంసీల సామర్థ్యంతో, 1.27 కిలోమీటర్ల పొడవుతో, 66 గేట్లతో నిర్మించారు.
👉 కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మించిన 3 బ్యారేజిలలో మూడవది పార్వతి (సుందిళ్ల) బ్యారేజి. పెద్దపల్లి జిల్లా, మంథని మండలంలో గోదావరి నదిపై 8.83 టీఎంసీల సామర్థ్యంతో, 1.45 కిలోమీటర్ల పొడవుతో, 74 గేట్లతో నిర్మించారు.
👉 సరస్వతి (అన్నారం) పంప్ హౌస్ కాళేశ్వరం ప్రాజెక్టులో రెండవ పంప్ హౌస్. 40 మెగావాట్ల సామర్థ్యం గల 8 పంపులతో ఈ పంప్ హౌస్ ను నిర్మించారు.
👉 సుందిళ్ళ పంప్ హౌస్ నుండి నీళ్ళు ఎల్లంపల్లి రిజర్వాయర్ కి చేరుకుంటాయి.. అక్కడి నుండి నంది మేడారం రిజర్వాయర్ కి.. దాని పక్కనే నీటిని లిఫ్ట్ చేయడానికి 124 మెగావాట్ల సామర్థ్యం గల 7 పంపులతో నంది (నంది మేడారం) పంప్ హౌస్ ను నిర్మించారు
👉 నంది మేడారం పంప్ హౌస్ నుండి నీళ్ళు గాయత్రి పంప్ హౌస్ (సర్జ్ పూల్) కి చేరుకుంటాయి
👉 139 మెగావాట్ల సామర్థ్యం గల 7 పంపులతో గాయత్రి (లక్ష్మీపూర్) పంప్ హౌస్ ను నిర్మించారు.
👉 గాయత్రి (లక్ష్మీపూర్) పంప్ హౌస్ లో బాహుబలి పంపులు లిఫ్ట్ చేసిన నీళ్లు SRSP వరద కాలువకి చేరుకొని అక్కడినుండి మిడ్ మానేరు కి చేరుకుంటాయి.
👉 గాయత్రి పంప్ హౌస్ నుండి నీళ్ళు మిడ్ మానేరు జలాశయానికి.. మిడ్ మానేరు (శ్రీ రాజరాజేశ్వర) జలాశయం 25.87 టీఎంసీల సామర్థ్యంతో రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయినపల్లి మండలం మన్వాడ గ్రామంలో మానేరు నదిపై నిర్మించారు. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కి వాటర్ హబ్ (జంక్షన్) లాంటిది.
👉 మిడ్ మానేరు నుండి నీళ్ళు అన్నపూర్ణ (అనంతగిరి) పంప్ హౌస్ కి వెళ్తాయి 106 మెగావాట్ల సామర్థ్యం గల 4 పంపులతో అన్నపూర్ణ (అనంతగిరి) పంప్ హౌస్ ను నిర్మించారు. ఆసియాలోనే అతిపెద్ద సర్జ్‌పూల్ (మహాబావి) దీని ప్రత్యేకత. ఇక్కడి నుండి నీటిని అన్నపూర్ణ రిజర్వాయర్ లోకి ఎత్తిపోస్తారు.
👉 అనంతగిరి (అన్నపూర్ణ) రిజర్వాయర్ సామర్థ్యం 3.5 టీఎంసీలు
👉 అన్నపూర్ణ (అనంతగిరి) రిజర్వాయర్ ➡️ చందలాపూర్ పంప్ హౌస్ ➡️ రంగనాయక సాగర్ రిజర్వాయర్. రంగనాయక సాగర్ సామర్థ్యం 3 టీఎంసీలు
👉 రంగనాయక సాగర్ నుంచి 16 కి.మీ. సొరంగం ద్వారా కొమరవెల్లి మల్లన్న సాగర్ సర్జ్‌పూల్‌లోకి గోదావరి జలాల తరలింపు. అక్కడి నుంచి అక్కారం సర్జ్‌పూల్‌లోకి.. తర్వాత మర్కూక్ సర్జ్‌పూల్‌లోకి నీళ్లు. అక్కడి నుంచి గోదావరి జలాలు కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌లోకి చేరతాయి.
👉 కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో రెండో అతి పెద్ద.. 618 మీటర్ల ఎత్తులోని 15 టీఎంసీల సామర్థ్యం గల కొండపోచమ్మ సాగర్ జలాశయం.
0 Comments
Please do not Enter any Spam link in the Comment Box