The lesson - The Life Span

పాఠం - జీవిత కాలం

👨 రోజు విఖ్యాత చిత్రకారుడు రవివర్మ బజారులో వెళుతూ ఉన్నాడు. 

👨 రవివర్మను గుర్తుపట్టిన ఒక యువతి సంతోషంతో ఆయన దగ్గరకు వెళ్ళి పలకరించి , ఏదైనా చిన్న పేయింటింగ్ గీసి ఇవ్వమని అభ్యర్థించింది. 

👨 బజారులో పేయింటింగ్ ఎలా చిత్రిస్తారు ? మరోసారి కలిసినపుడు తప్పక చిత్రాన్ని వేసి ఇస్తాను అన్నా కూడా ఆ యునతి మొండిగా మారాం చేసే సరికి ఒక పేపర్ పై అప్పటికప్పుడు చిత్రాన్ని చిత్రించి ఇచ్చేశాడు. ఇస్తూ ఇస్తూ ....నవ్వుతూ అన్నాడు దీని విలువ కోటి రూపాయలు.జాగ్రత్తగా కాపాడుకో. 

👨 ఆ యువతి ఆశ్చర్యంగా పేయింటింగ్ వంక చూస్తూ ఉండి పోయింది. మరుసటి రోజు ప్రముఖ చిత్రకారుల చిత్రాలు అమ్మే వ్యక్తిని కలిసి ఈ రవివర్మ చిత్రాన్ని అమ్మితే ఎంత ధరకు అమ్ముడు పోతుందని వాకబు చేసింది. 

👨 ఆయన కూడా రవివర్మ చెప్పినట్లే చెప్పేసరికి నోటమాట రాక మళ్ళీ రవివర్మ గారిని కలవడానికి వెళ్ళింది. రవివర్మని కలిసి ఇలా అంది ...

👨 మీరు పది నిమిషాలలో చిత్రించిన చిత్రానికి ఇంత విలువ ఉంటుందని అనుకోలేదు. నాకు కూడా చిత్రకళలోని మెళకువలు నేర్పండి. 

👨 మీలా పది నిమిసాలలో కాక పౌయినా....పది రోజులకు ఒక చిత్రాన్నైనా గీయగలను. 

👨 రవివర్మ నవ్వుతూ అన్నాడు అమ్మాయీ...! 

👨 నీకు పది నిమిషాలలో చిత్రాన్ని గీసి ఇచ్చాను. నిజమే. 

👨 దీని వెనకాల నా 30 సంవత్సరాల కఠోర సాధన ఉంది. 

👨 నవ్వూ నీ 30 సంవత్సరాలు ఈ కళ కోసం త్యాగం చేయగలిగితే నాలా తయారవగలవు. 

👨 ఆ యువతి నోటమాట రాక అలాగే చూస్తూ ఉండి పోయింది.

👨 ఒక టీచర్ చెప్పే 45 నిమిషాల పాఠం వెనుక కూడా అతని జీవితం లోని ఎన్నో సంవత్సరాల కఠిన సాధన ఉంటుంది.

👨 తల్లి తండ్రులు నీకు చెప్పే మాటల వెనుక కూడా, నీ ఊహకు కూడా అందని ప్రేమ, త్యాగాలు అనుభవాలు ఉంటాయి. అలాగే 

👨 ఒక బ్రహ్మ జ్ఞాని ఎదురుగా నీవు కొన్ని నిముషాలు కూర్చుంటే, నీ జీవితమే మారిపోతుంది.... 

👨 ఉపాధ్యాయుల పాఠాలు

👨 తల్లి తండ్రుల మంచిమాటలు

👨 గురువుల జ్ఞాన బోధలు కూడా రవివర్మ చిత్రాల్లా నీ ఊహకు కూడా అందని విలువైనవి


Post a Comment

0 Comments