WHY TELANGANA BUILT A KALESHWARAM BARRAGE?
(కాళేశ్వరం డ్యాము/ఆనకట్ట)
👉 రిజర్వాయర్ అంటే నీటిని నిలువ చెసేది..
👉 బ్యారేజి అంటే నీటిని దారి మళ్ళించేది.
👉 మేడిగడ్డ దగ్గర నిర్మించిన కాళేశ్వరం ఒక బ్యారేజ్.
👉 మహారాష్టృఅలో వార్ధా, వైన్ గంగా అనే రెండు నదులు తెలంగాణ సరిహద్దులో తుమ్మిడిహట్టి అనే చోట కలిసిపోయి ప్రాణహిత నదిగా మారుతుంది. ఆ స్థలంలో ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ కట్టి ఉంటే ఎలాంటి లిఫ్ట్ ఇరిగేషన్(ఎత్తిపోతల) అవసరం లేకుండా సహజమైన గ్రావిటేషనల్ ఫోర్స్ తోనే (కొంతమేర మాత్రమే అవసరం) చేవెళ్ళ వరకూ నీటిని పంపవచ్చు.
👉 మరి అక్కడ కాకుండా చాలా దిగువన మేడిగడ్డ దగ్గర కట్టి తిరిగి గోదావరి నదిలోకే పైకి ఎందుకు పంపించాలి అంటే.. తుమ్మడి హట్టి దగ్గర నీటి లభ్యత తక్కువ. ఆ తరువాత ప్రాణహిత నది చిన్న చిన్న నదులను, వాగులను కలుపుకుని పెద్దదిగా మారుతుంది.
👉 అలా పెద్దగా అయిన ప్రాణహిత నది గోదావరి నదిలో కలవగానే గోదవరి నది చాలా పెద్దదిగా మారుతుంది.
👉 ప్రాణహిత నది గోదావరి నదిలో కలిసే స్థలానికి కొంత దూరంలో దిగువన ఉన్న ప్రాంతమే మేడిగడ్డ. అక్కడ బ్యారేజ్ కట్టకుంటే ఆ నీరంతా తలంగాణ దాటి వృధాగా వెళ్ళిపోతుంది.అక్కడ నీటిని ఆపి మన తెలంగాణ రాష్టం లోపలికి తెచ్చుకుని రాష్ట్రం అంతటా పారించడం అన్నమాట ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే.
👉 ఇప్పుడు దీని రూపాన్ని చూద్దాం..
మేడిగడ్డా దగ్గర బ్యారేజిని కట్టి నీటిని నిలువ చేసి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా గోదావరి పైననే నిర్మించబడిన రిజర్వాయర్లలోకి.. ముందుగా మేడిగడ్డ నుండి అన్నారం కు, అక్కడ జమ అయిన నీటిని సుందిళ్ళ కు, అక్కడినుండి నీటిని ఎల్లంపల్లి కి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తీసుకెళతారు. ఇవి మూడూ గోదావరి నది మీద నిర్మించబడ్డ ప్రాజెక్టులే.
అంటే గోదవరి నదిలో కింద ఉన్న నీటిని తిరిగి గోదావరిలోనే పైకి తేవడం అన్నమాట. ఇది లింక్ 1.
లింక్ 2 లో ఎల్లంపల్లి నుండి మేడారం మీదుగా, శ్రీరాం సాగర్ వరద కాలువ ద్వారా మిడ్ మానేరు కు నీరు తేవడం. (ఇది దాదాపు నచురల్ గ్రావిటేషన్ తోనే వస్తుంది)
లింక్ 3 లో మిడ్ మానేరు నుంది ఎగువ మానేరుకు నీళ్ళు వెళతాయి.
లింక్ 4 లో మిడ్ మానేరు నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్ కు నీటిని తీసుకు వెళతారు.
లింక్ 5 లో గంధమల్ల బస్వాపూర్ రిజర్వాయర్ లకు,
లింక్ 6 లో కొమురవెల్లి మల్లన్న సాగర్ నుంచి సింగూరు కు,
లింక్ 7 లో శ్రీరాం సాగర్ నుంచి పాత ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు నీళ్ళను అందిస్తారు.
👉 మొత్తం 7 లింకులతో 28 ప్యాకేజి లతో ప్రపంచంలోనే ఒక మానవ నిర్మిత అద్భుతం కాలేశ్వరం ప్రాజెక్ట్. ఇది తెలంగాణకే కాదు భారతదేశానికే గర్వకారణం.
0 Comments
Please do not Enter any Spam link in the Comment Box