Zero Academic Year- To whom to Zero

జీరో అకాడమిక్ ఇయర్- ఎవరిని జీరో చేసేందుకు

💁 ఏమిటి ఈ జీరో అకడమిక్ ఇయర్? ఒక సంవత్సరం  మొత్తము పాఠశాలలు మూసివేసి, కళాశాలలు మూసివేసి యూనివర్సిటీలు మూసివేసి, సంవత్సరం పాటు విద్యార్థులకు ఎటువంటి బోధన జరపకుండా విద్యార్థులను ఇంటికే పరిమితం చేయడాన్ని జీరో అకాడమిక్ ఇయర్ అంటారు.

💁  ప్రపంచవ్యాప్తంగా Covid 19 విద్యా వ్యవస్థ పై తీవ్ర ప్రభావం చూపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మంది విద్యార్థులు పాఠశాలలకు దూరమయ్యారు. అదేవిధంగా కళాశాలలు యూనివేర్సిటీల నుండి కూడా అనేక  కోట్ల మంది విద్యార్థులు దూరమయ్యారు.

💁 ప్రపంచంలోని వివిధ దేశాల్లో విద్యార్థులకు ఏ విధంగా మళ్లీ విద్యాసంస్థలు ప్రారంభించాలి అనే అంశంపై తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఈ విద్యా సంవత్సరానికి జీరో ఇయర్ గా చేయాలనే ప్రతిపాదనలు లేవు. ఇందులో కరోన-Carona దెబ్బకు విపరీతంగా దెబ్బతిన్న దేశాలు ఉన్నాయి. కొన్ని దేశాలయితే ఇప్పటికే విద్యా సంస్థలు ప్రయోగాత్మకముగా తెరిచారు.

💁 జీరో ఇయర్  ఆలోచన చేసిన మేధావులు నాకు ప్రపంచంలో ఎక్కడా కనిపించలేదు.  కానీ భారతదేశంలో కొందరు మేధావులు విద్యా సంవత్సరాన్ని జీరో ఇయర్గా ప్రకటించాలంటూ ఇప్పటికే ప్రభుత్వాలకు వినతి పత్రాలు ఇస్తున్నారు. అసలు విద్యా సంవత్సరం ప్రారంభం అవడమే ఇప్పుడు జరుగుతుంది. అప్పుడే తొందరపాటు ఎలా.

💁కేసులు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సంగతి, భారతదేశంలో మరీ ఎక్కువగా పెరుగుతున్న సంగతి గమనిస్తున్నాం. కానీ ప్రపంచంలో గతంలో అత్యధిక స్థాయి కేసులు నమోదయిన చాలా దేశాల్లో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన విషయం కూడా మనం గమనించాలి.  ఏ దేశంలో కూడా నాలుగైదు నెలల కన్నా ఎక్కువగా కొవిడ్-19 ప్రభావం లేదు. అంటే మన దేశంలో కూడా అతి త్వరలో, ఒకటి, రెండు నెలల కాలంలో ఈ Covid 19 యొక్క ప్రభావం తగ్గే అవకాశం కచ్చితంగా ఉంది.

💁 బహుశా జూలై మధ్యలో లేదా ఆగస్టులో ఖచ్చితంగా కేసులు తగ్గే అవకాశం ఉందని చెప్పి చాలా మంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది కొత్త వైరస్ కాబట్టి మనము దీని యొక్క గమనం ఎలా ఉంటుంది కచ్చితంగా చెప్పలేం. అంతమాత్రాన ఒక సంవత్సరం మొత్తం పాఠశాలలు ఇతర విద్యాసంస్థలు మూసివేసి విద్యార్థులను పూర్తిగా విద్యకు దూరం చేయవలసిన అవసరం లేదు.

💁   వైరస్ ఏవిధంగా పురోగమిస్తుంది అనే  అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి.

💁 నిజంగానే విద్యాసంస్థలు మూసివేస్తే ఒక సంవత్సరం పాటు, ఎవరికి ఎక్కువ నష్టం జరుగుతుంది. అన్ని వనరులు అందుబాటులో ఉన్నటువంటి ఉన్నతవర్గాల విద్యార్థులు ఆన్లైన్ వ్యవస్థ ద్వారా విద్యను అభ్యసించే ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వం ఎన్ని నియమనిబంధనలు తెచ్చినప్పటికీ పాఠశాలలు ఇతర విద్యాసంస్థలు ఆన్లైన్ లో కూడా విద్యాబోధన అపి వేసినప్పటికీ ఇతర అంతర్జాతీయ ఆన్లైన్ మాధ్యమలను ఉపయోగించి ఉన్నత వర్గాల వారు వారి పిల్లలకు కచ్చితంగా విద్యను అందించే ప్రయత్నం చేస్తారు.

💁 స్థూలంగా నష్టపోయేది ఎవరు? పేద మధ్య తరగతి పిల్లలు. ఇప్పటికే ఆర్థిక అసమానతల వల్ల సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల మధ్య విద్యాపరమైన అంతరాలున్నాయి.  ఇప్పుడు కరోనా పేరు చెప్పి ఒక సంవత్సరం పాటు విద్యాసంస్థల కనుక మూసివేస్తే ఈ అంతరము మరింత పెరుగుతుంది.

💁 ఇలా విద్యా సంవత్సరం మొదలయిందో లేదో, అప్పుడే అంతం అయిపోయినట్టు వెంటనే సంవత్సరంపాటు విద్యాసంస్థలు  మూసివేయాలని కోరడం ఏమిటి? ఈ వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది ఏ విధంగా పురోగమించి బోతుంది అని ఎప్పటికప్పుడు పరిశీలన జరుగుతూనే ఉంటుంది కదా!

💁 రోజు రోజుకు డాక్టర్లు ఈ వైరస్ను ఎలా ఎదుర్కోవాలి అనే విషయంపై అవగాహన సాధిస్తున్నారు. అందువల్ల కచ్చితంగా దీన్ని ఎదుర్కొనే శక్తి మనకు వస్తుంది అదే విధంగా వివిధ రకాల మందులు వ్యాక్సిన్లు-Vaccine త్వరలో అందుబాటులోకి వస్తాయని కూడా వార్తలు వస్తున్నాయి.

💁అందువల్ల పరిస్థితిని గమనిస్తూ తీసుకోవాల్సిన  నిర్ణయాలను, ఒకేసారి విద్యా సంవత్సరానికి మంగళం ప్రకటించాలనే డిమాండ్లు సరికాదు.

💁 ఒక రోగానికి ఇచ్చే వైద్యము సమస్య కన్న ప్రమాదకరంగా ఉండకూడదు.  ఈ జీరో ఇయర్ అనే  ప్రతిపాదన, అది కరోనా వైరస్ మూలంగా జరిగే నష్టం కన్నా ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది.

💁 అందువల్ల ఇటువంటి తొందరపాటు డిమాండ్లు చేయరాదు. ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ ముందుకు వెళ్లాలి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రతి ఒక్కరికి కూడా విద్య అందే విధంగా చర్యలు తీసుకునే ప్రతిపాదనలు చేయాలి.

💁 వివేకానందుల వారు  చెప్పినట్టు సమస్యకు మనం  భయపెడితే సమస్య ఇంకా భయపెడుతుంది సమస్యకు ఎదురొడ్డి పోరాడి పరిష్కారం చేయాలి.

💁 ఈ జీరో ఇయర్ అనే ప్రతిపాదన కచ్చితంగా పేద మధ్య తరగతి విద్యార్థుల భవిష్యత్కు గొడ్డలి పెట్టు. ఇప్పటికే కరోన వల్ల బాల్యవివాహాలు, బాల కార్మికులు, గృహహింస, లైంగిక వేధింపుల ఎక్కువవుతున్నాయని వార్తలు వస్తున్న నేపధ్యంలో జీరో ఇయర్ ప్రతిపాదనలు అడ్డుకోవాలి..

విద్యార్థులకు ఆరోగ్యం, విద్యా రెండు అవసరమే. విద్య ఒక నిరంతరప్రవాహం....

                                                                                        Dr. A. VENU GOPALA REDDY

                                                                        PRINCIPAL, TS MODEL SCHOOL, VEENAVANKA

                                                                                                        9948106198

Post a Comment

0 Comments