The art of conditioning
ఈ పోస్ట్ మీ జీవితాన్ని మార్చేస్తుంది నన్ను
నమ్మండి.
👌 ఊర్లలో, కొత్తగా ఇంటికి తీసుకొచ్చిన కోడిని
ఇంటి ఆవరణకు అలవాటు చేయడానికి, ఒక వారం రోజుల పాటు, ఒక
గుంజేకు(కర్రకు) తాడుతో కట్టేస్తారు, తర్వాత దాన్ని విడిచిపెట్టిన ఊరు మొత్తం తిరిగి
తిరిగి చీకటి పడే ముందు అదే ఇంటికి వచ్చి గంప చుట్టూ తిరుగుతది కానీ పారిపోదు
ఎందుకంటే దాన్ని అలా conditioning చేశారు. ఎంత అంటే పంజరంలో ఉన్న చిలుక
ఎగురుతున్న పక్షుల్ని చూసి వాటికి ఏదో రోగం వచ్చింది కావొచ్చు అనుకునే అంత conditioning చేస్తారు.అదే విధంగా ఒక ఏనుగు ఎంత పెద్ద వృక్షమైన విరగొట్టే అంత బలం
గలిగి ఉంటుంది, కానీ దాన్ని ట్రైన్ చేసిన మవాటి ఒక చిన్న
కట్టెకు కట్టిన సరే అది తెంపుకొని పారిపోదు,
ఆ ఏనుగుని పుట్టినప్పటి నుండి అలా
కండిషనింగ్ చేస్తారు కాబట్టి.
👌 Ex:- సంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచారాలు
బాగా ఫాలో అయ్యే ఒక మహిళ, ఎవరైనా న్యూ జనరేషన్ అమ్మాయి మోడరన్ గా తనకు నచ్చినట్టు తాను బ్రతికితే బరితెగించి
బ్రతుకుతుంది అంటారు, కానీ వారు మాత్రం అందమైన పంజరంలో జీవిత ఖైదు
అయ్యాము అని మాత్రం ఒప్పుకోరు..
👌 అదే విధంగా Western countries లో,కొత్తగా ఇంటికి తెచ్చిన కుక్కను కొన్ని రోజుల
పాటు ఇంటి ఆవరణలో ఒక fence వేసి పెడతారు, తర్వాత ఆ కుక్క ఆ (fence) కంచె
దాటి వెళ్లే ప్రయత్నం life లో చేయదు,
దీనే habitual conditioning అంటారూ.
అలాగే ఒక ఏనుగు కావొచ్చు, ఎద్దు కావొచ్చు, గుర్రం కావొచ్చు ఒక చిన్న తాడుతో
కట్టిపడేస్తే అక్కడే పడి ఉంటాయి కానీ సంకెళ్ళు తెంచుకుని ముందుకు వెళ్లలేవు దీనే #psychological conditioning అంటారు.
👌ఇలా మనుషులు కూడా పుట్టి పెరుగుతున్న
టైంలో ఆల్మోస్ట్ అన్ని ఆచార వ్యవహారాల్లో conditioning
చేయబడుతారు,
👌 Ex:- ఒక ముస్లిం కుటుంబంలో పుట్టిన వ్యక్తి తన మతమే
గొప్ప, అల్లా మాత్రమే దేవుడు అనుకుంటాడు, అదే
విధంగా హిందు లేదా ఇతర మతల్లో పుట్టిన వాడు తన దేవుడే గొప్ప తన మతమే గ్రేట్
అనుకుంటాడు. ఇలా వారిని వారి చుట్టూ పక్కల ఉన్న సమాజం, కుటుంబం, ఆచారాలు, పరిసరాలు
అన్ని నిరంతరం conditioning చేస్తుంటాయి, at the end of the day వారు
నేర్చుకున్నది నిజం, మిగతాది అబద్ధం లేదా అవాస్తవం అని అనుకుంటారు
కానీ నిజాన్ని ఒప్పుకోరు.
👌 Ex:- ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లేదా బాలయ్య
ఫ్యాన్ లేదా ఇంకో హీరో అనుకుందాం అసలు ఆ వ్యక్తి వీళ్లకు ఎందుకు ఫ్యాన్ అనే విషయం
వాడికి కూడా సరిగ్గా తెలీదు బట్ చుట్టు పక్కన ఉన్నవారిని చూసి అనుకరిస్తాడు ఒకవేళ
అలా చేయకపోతే వాడు తేడా అని ముద్ర పడుతుంది,
కనుక, వీడు లైఫ్ లో ఎప్పుడు కూడా వాడు
అభిమానించే హీరో ఎందుకు గొప్పవాడు అని ఆలోచించకుండా గుడ్డిగా అభిమానం పెంచుకుంటాడు,ఆ హీరో
గురించి ఏ రోజు తప్పుగా ఆలోచించడానికి కూడా సాహసం చేయడు, వాళ్ళ
హీరో గురించి ఎవరైనా తప్పుని తప్పు అని point
out చేసి చూపిస్తే, వాళ్ల
మీద ఎటాక్ చేస్తారు, వీరి మెదడు ఎంత భయంకరంగా #conditioning అవుతుందంటే వాడి మతమే గొప్ప, వాడి సంప్రదయమే గొప్ప, వాడి
హీరోనే గొప్ప, వాడి కులమే గొప్ప, వాడి
ప్రాంతమే గొప్ప ఇలాంటి arrogant mindset
develop అవుతుంది. చివరకు వాడు నిజం ఏంటో
అబద్ధం ఏంటో గ్రహించకుండా బావిలో కప్పలగా తాను అనుకున్నదే కరెక్ట్ అనే భావనలో
బ్రతికి చివరికి ఒక ముర్కుడిలాగా చనిపోతాడు,
ఇలాంటి వారు బాగా ముదిరిపోతే తీవ్రవాదులు
లేదా మత ఛాందస వాదులుగా తయారు అవుతారు...!!!
👌 Every child is a born atheist,
freethinker and freebird but later on they become fundamentalists, casteist,
arrogant hero worshippers when they grow up. అంటే పుట్టిన ప్రతి బిడ్డకు తన మెదడులో కులం,మతం,దేవుడు,ద్వేషం
లాంటి భావాలు లేకుండా పుట్టి, పెరుగుతున్న క్రమంలో కుటుంబాన్ని, సమాజాన్ని, తన
చుట్టూ ఉన్న పరిసరాల్ని చూసి నేర్చుకుంటాడు.
👌 బాల్యంలో పిల్లల్లో ఉన్న questioning పెరిగి పెద్ద అవుతుంటే ఉండకపోడానికి కారణం, అతని
మెదడు మొత్తం తరతరాల చెత్తతో మురుకి పట్టిపోతుంది (conditioning వల్ల) కాబట్టి
వాడు నమ్మిన దేవుడ్ని కానీ, వాడు అభిమానించే హీరోని కానీ వాడి మతాన్ని కానీ
ఎవరైనా కొంచెం విమర్శించిన తట్టుకోలేడు. వాడు బాల్యం నుంచి నమ్మింది తప్పు అని
తెలిస్తే వాడి ego దెబ్బ తిని దాడులు చేస్తారు. ఇలా conditioning చేయబడిన మనుషులు జీవితం మొత్తం ఏదో ఒక ism ఇజంని
గాడిద లాగా మోస్తూ మోస్తూ చివరకు నడుం విరిగి చనిపోతారు.
👌 Note:- చివరిగా నేను చెప్పే విషయం ఏంటంటే, break the barriers and explore the life beyond the
boundaries of conditioning.
👌మనం చిన్నప్పటి నుండి నేర్చుకున్న అన్ని
విషయాలు కరెక్ట్ అవ్వొచ్చు, అవ్వకపోవచ్చు కాబట్టి మనం నేర్చుకున్న విషయం
నిజం కాకపోతే, అసలు నిజమేంటో అని శోధించి తెలుసుకోవాలి.
👌 దీన్ని
మనం #unlearning #process అంటాం. సరైన విషయాలు నేర్చుకుంటూ, విశ్వ
మానవుడిగా ప్రతి ఒక్కరు ఎదగాలి.
0 Comments
Please do not Enter any Spam link in the Comment Box