CHILDREN FEE REIMBURSEMENT DETAILS in Telangana

 CHILDREN FEE REIMBURSEMENT DETAILS

children fee reimbursement


Non Gazetted ఉద్యోగుల పిల్లల ఫీజు రియంబర్స్మెంట్:-
తెలంగాణ ప్రభుత్వం పీఆర్సీ 2015 లో G.O.Ms.No.27 SE, తేది: 24.9.2015 ప్రకారం నాన్ గజిటెడ్ ఉద్యోగుల పిల్లలకు #LKG నుండి #Intermediate వరకు రూ.2,500 Fee Reimbursement చెల్లించేందుకు ఉత్తర్వులు విడుదల చేసింది.
 
ఇటీవల ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ దీనిపై Memo.No. 9782/593/A/Admin.I/2017 తేది:23.7.2018 ద్వారా వివరణ ఇవ్వడం జరిగింది.
 
010 పద్దు ద్వారా జీతాలు డ్రా చేస్తున్న నాన్ గజిటెడ్, నాల్గవ తరగతి ఉద్యోగులు అర్హులు.
 
ఉద్యోగుల పిల్లలు చదివే పాఠశాల రాష్ట్ర లేక కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందియుండాలి.
 
భార్య,భర్త ఇరువురు ఉద్యోగస్థులైన ఒకరు మాత్రమే ఈ #Reimbursement ను క్లయిం చేయాలి.
 
ఉద్యోగంలో ఒకరు Gazetted ,మరొకరు Non Gazetted ఉంటే ఈ Reimbursement వర్తించదు.
 
ఉద్యోగి సస్పెన్షన్ లో ఉంటే రియంబర్స్మెంట్ వర్తించదు.
 
అకడమిక్ సంవత్సరం పూర్తయిన తరువాత ఒరిజినల్ ఫీజు రశీదులు జతచేయాలి.
 
✊✊ పిల్లలు చదువుతున్న పాఠశాల ప్రిన్సిపల్ అటెస్టేషన్ తప్పనిసరి.

Post a Comment

0 Comments