👌 ఉపాధ్యాయ,
ఉద్యోగులకు సేవా పుస్తకం (#Service Register)
అత్యంత ముఖ్యమైం ది. అది కాస్తా ఎక్కడైనాపోతే ఏం చేయాలి..? ముందు జాగ్రత్తగా సేవా పుస్తకాన్ని ఉద్యోగులు
తమ వద్ద ఉంచుకోవచ్చా? నకలు(Dulplicate) ఎలా సిద్ధం చేసు
కోవాలి.. తదితర విషయాలు మీ కోసం..
👌ఒరిజినల్ సేవా పుస్తకంలో సమోదైన వివరాలన్నీ
నకలుసేవా పుస్తకంలో స్పష్టంగా రాయాలి.
👌ఉద్యోగి పనిచేసే కార్యాలయాధిపతితో నకలు సేవా
పుస్తకంలో ఎప్పటికప్పుడు ధృవీకరణ చేయించుకోవాలి. ఈ బాధ్యత ఉద్యోగులదే.
👌ఒరిజినల్ సేవా పుస్తకాన్ని ఎప్పుడూ కార్యాలయం
లోనే ఉంచాలి.
👌కార్యాలయ ఆధిపతి స్వాధీనంలో ఉండగా సేవా పుస్తకం
కాలిపోయినా, ఎక్కడైనా పోయినా డూప్లి కేట్ సేవా పుస్తకం
సహాయంతో తిరిగి నూతన పుస్తకం తయారుచేస్తారు.
👌శాఖాధిపతి అనుమతితో నియమాధికారి గాని లేక అతడి
ఆదేశాలతో ఇతర అధీకృత అధికారి గాని కొత్త సేవా పుస్తకాన్ని తయారు చేస్తారు.
👌ఉపాధ్యాయులకు సంబంధించినంత వరకు పాఠశాల
విద్యాశాఖ కమిషనర్ అనుమతితో డీఈఓ నూతన సేవా పుస్తకాన్ని పునర్నిర్మిస్తారు. #District Educational Officer ఆదేశిస్తే MEO ఉన్నత పాఠశాల HMలు కూడా తయారు చేయవచ్చు.
👌తన నియంత్రణలో పనిచేసే ఉపాద్యాయ, ఉద్యో గులకు కార్యాలయాధిపతి ముందుగా నోటీసు
జారీ చేసి, ఏడాదిలో ఒకసారి ఒరిజినల్ సేవా పుస్త కాన్ని
వారికి చూపించాలని ప్రభుత్వం 152 జీఓను 1969 మే 20న జారీ చేసింది.
👌ఇలా చూపించిన తదుపరి కార్యాలయ అధికారి ప్రతి
సంవత్సరం సెప్టెంబర్ చివరన ధృవీకరణ పత్రాన్ని రూపొందించి పై అధికారికి పంపాలి.
👌ఉద్యోగ, ఉపాధ్యాయులు
ప్రతి సంవత్సరం తమ Original సేవా పుస్తకంలో సంతకం చేయడం మరచి పోవద్దు. అందులో పొందు
పరచిన అంశా లను,
దృవీకరణలను విధిగా తనిఖీ చేసుకోవాలి.
👌ఒకవేళ ఉద్యోగి విదేశీ పర్యటనలో ఉంటే. అడిట్
అధికారులు సేవా పుస్తకంలో అవసరమైన నమో దులు చేసిన తరువాతే ఉద్యోగి సంతకం చేయాలి.
👌వార్షిక ధృవీకరణలు చేయనట్లయితే సేవాకాలం లోనూ, పదవీ విరమణ పెన్షన్ తదితర విషయా లోనూ సమస్యలు
ఉత్పన్నం అవుతాయి.
👌నకలు సేవా పుస్తకాన్ని తయారు చేసుకునే వరకు
ఒరిజనల్ ను జిరాక్స్ తీయించి భద్రపరచుకోవాలి.
👌ఈ నిబంధనలు ప్రభుత్వ శాఖల్లో పనిచేసే గెజిటెడ్
అధికారి నుంచి అటెండర్ వరకు వర్తిస్తాయి.
0 Comments
Please do not Enter any Spam link in the Comment Box