QUESTIONS AND ANSWERS CHILD CARE LEAVE in Telangana

 QUESTIONS AND ANSWERS 

 CHILD CARE LEAVE 

Child Care Leaves


చైల్డ్ కేర్ లీవ్ సందేహాలు-సమాధానాలు:
 
👇 సందేహము: 
#CHILD CARE LEAVE ఒక SPELL కు మాగ్జిమం ఎన్ని రోజులు  పెట్టుకోవచ్చు. 1,2 రోజులు కూడా పెట్టుకోవచ్చునా ?
 👉 సమాధానము:
G.O.Ms.No.209 Fin తేది:21.11.2016 ప్రకారంవివాహిత మహిళా ఉపాధ్యాయులు ప్రతి SPELL కు మాగ్జిమం 15 రోజుల చొప్పున 6 SPELL లకు తగ్గకుండా 90 రోజులు వాడుకోవచ్చును. జీవోలో 6 స్పెల్ లకు తగ్గకుండా అన్నారు కాబట్టి 1,2 రోజులు కూడా వాడుకొనవచ్చును.
 
***************
 
👇 సందేహము: 
CHILD CARE LEAVE ముందుగానే మంజూరు చేయించుకోవాలా? సెలవు కాలంలో పూర్తి జీతం చెల్లిస్తారా ?
 👉 సమాధానము:
CHILD CARE LEAVE ను #DDO తో ముందుగానే మంజూరు చేయించుకుని, PROCEEDINGS ద్వారా వివరాలను సర్వీసు పుస్తకములో నమోదు చేయించుకోవాలి.ఆ నెల వేతనాన్ని యధావిధిగా మంజూరు చేయాలసీన బాధ్యత DDO దే.
 
**************
 
👇 సందేహము: 
CHILD CARE LEAVE పెట్టిన సెలలో ఇంక్రిమెంట్ ఉన్నట్లయితే మంజూరు చేయవచ్చునా ?
 👉 సమాధానము:
వీలుపడదు. సెలవు కాలంలో వేతన వృద్ధి ఉండదు.కావున సెలవు అనంతరం విధులలో చేరిన నాటినుండే ఇంక్రిమెంట్ మంజూరుచేస్తారు.
 
***************
 
👇 సందేహము:
మెటర్నిటి లీవుకు కొనసాగింపుగా చైల్డ్ కేర్ లీవు పెటుకోవచ్చునా ?
 👉 సమాధానము:
చైల్డ్ కేర్ లీవును అన్ని విధాలుగా  Other than casual, Special casual leave తో కలిపి పెట్టుకోవచ్చునని జీవో.209 లోని రూలు 3(i) సూచిస్తోంది.
 
****************
 
 👇 సందేహము:
సర్రోగసి,దత్తత ద్వారా సంతానం పొందిన .మహిళా ఉద్యోగులు చైల్డ్ కేర్ లివ్ కు అర్హులేనా ?
 👉 సమాధానము:
అర్హులే,90 రోజుల సెలవు వాడుకొనవచ్చును.
 
***************
 
👇 సందేహము:
భార్య మరణించిన పురుష ఉద్యోగికి చైల్డ్ కేర్ లివ్ మంజూరు చేయవచ్చునా ?
 👉 సమాధానము:
వీలు లేదు. ఇందుకు సంబంధించిన GO.209 లో Women Employees అని ఉన్నది.
 
****************
 
👇 సందేహము:
చైల్డ్ కేర్ లీవ్ కు అప్లై చేసిన ప్రతిసారి పుట్టినతేది వివరాలు సమర్పించాలా?
 👉 సమాధానము:
అవసరం లేదు. మొదటి సారి అప్లై చేసేటపుడు మాత్రమే కుమారుడు/కుమార్తె డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ సమర్పించాలి. ప్రతి దఫా అప్లికేషన్ సమర్పిస్తే సరిపోతుంది.
 
***************
 
👇 సందేహము:
 పిల్లల అనారోగ్యం,చదువుల కొరకు మాత్రమే చైల్డ్ కేర్ లీవ్ మంజూరుచేస్తారా ?
👉 సమాధానము:
GO.209 point.3 లో  ఇలా ఉన్నది "Children needs like examinations,sickness etc", అని ఉన్నది కావున పై రెండు కారణాలకే కాకుండా ఇతరత్రా కారణాలకు కూడా చైల్డ్ కేర్ లీవు మంజూరు చేయవచ్చును.
 
****************
 
👇 సందేహము:
 చైల్డ్ కేర్ లీవ్ కు Prefix, Suffix  వర్తిస్తాయా ?
 👉 సమాధానము:
వర్తిస్తాయి,ప్రభుత్వ సెలవు దినాలతో ఇట్టి సెలవును అనుసంధానం చేసుకోవచ్చును


Post a Comment

0 Comments