FR-49 Rule of Employees
👌మౌలిక నిబంధన FR-49 ఏం చెబుతోంది
👌ప్రభుత్వం ఉద్యోగిని ఒకేసారి రెండు పోస్టులలో నియమించవచ్చును.
👌ఒక ఉద్యోగి తన బాధ్యతతో పాటు మరొక ఖాళీ పదవి నిర్వహణ బాధ్యత అప్పగించినపుడే "అదనపు చార్జి" గా పరిగణిస్తారు. కొత్తగా సృష్టించిన పోస్టులకు గాని,నాల్గవ తరగతి పోస్టులకు 'అదనపు చార్జి' వర్తించదు.
👌అదనపు చార్జికి అదనపు వేతనం పొందాలంటే కనీసం 14 రోజుల పనిదినాలుండాలి.
👌మొదటి 3 నెలలకు మూలవేతనం (Basic Pay) పై 1/5 వంతు వేతనము, తదుపరి 3 నెలలకు 1/10 వంతు వేతనము FAC అలవెన్స్ పేరుతో చెల్లించెదరు.
👌మొదటి 3 నెలలకు మంజూరుచేయు అధికారం RJD లకు ఇవ్వబడింది.
(C&DSE Rc.No.1827/C2/2009 తేది:25.11..2010)
👌తదుపరి 3 నెలల అలవెన్స్ C & DSE మంజూరుచేయును.
👌6 నెలలకు మించి అదనపు వేతనాన్ని పొందటానికి అనుమతించ రాదు.
(G.O.Ms.No.197
F&P తేది:04-07-1964)
0 Comments
Please do not Enter any Spam link in the Comment Box