QUESTIONS and ANSWERS on Services

 QUESTIONS and ANSWERS on Services

Question and Answers on Services


1.సందేహం:
భార్యాభర్తలు ఇద్దరు టీచర్లు. ఇద్దరు పాత పెన్షన్ పరిధిలో ఉన్నవారే! అయితే, దురదృష్టవశాత్తు భర్త గుండెపోటుతో మరణించాడు. భార్య సర్వీస్ లోనే ఉన్నారు. భర్త చనిపోయిన కారణంగా... భార్యకు ఫ్యామిలీ పెన్షన్ కూడా చెల్లిస్తున్నారు.ఈ ఫ్యామిలీ పెన్షన్ పై Dearness Relief (DR ) చెల్లిస్తారా?
 సమాధానం:
👌 DR చెల్లిస్తారు
👌
G.O.Ms.No.33 Fin Dt: 07.04.2015 లోని point.26 లో ఇలా ఉంది "The employed family pensioner shall be entitled for payment of Dearness Relief on family pension irrespective of the fact that he/she getting Dearness Allowance  on his/her pay.
 
👌 ఫ్యామిలీ పెన్షన్ పై DR ఎప్పుడు చెల్లించరంటే......

 1. ఒక సర్వీస్ పెన్షన్, మరొక ఫ్యామిలీ పెన్షన్... ఇలా రెండు పెన్షన్లు ఒకరే పొందుతున్న సందర్భాల్లో.... ఫ్యామిలీ పెన్షన్ పై DR రాదు.
 
2. కారుణ్య నియామకం పొందిన సందర్భాల్లో కూడా ఫ్యామిలీ పెన్షన్ పై DR చెల్లించరు.
-------------------------------------------------------------------------------------

2.సందేహం:
సస్పెన్షన్ కాలాన్ని అసాధారణ సెలవుగా పరిగణిస్తే ఆ కాలాన్ని ఇంక్రిమెంట్లు,పెన్షన్ కు లెక్కిస్తారా?
సమాధానం:
👌వివిధ కారణాలతో  కొందరు ఉద్యోగ, ఉపాధ్యాయులు సర్వీస్ నుంచి సస్పెన్షన్ కు గురవుతారు. కొన్ని నెలలపాటు సస్పెన్షన్ ఉన్న తర్వాత Competent Authority .... సస్పెన్షన్ ఎత్తివేసి... వారిని తిరిగి రీఇన్స్టెట్ చేస్తారు. చాలా కేసుల్లో సస్పెన్షన్ పీరియడ్ కు ఎలిజిబుల్ లీవ్ మంజూరు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలూ జారీచేస్తారు. ఇలాంటి సందర్భాల్లో సదరు ఉద్యోగికి సస్పెన్షన్ కాలానికి సరిపోయే సెలవులు.... Half Pay Leave మరియు Earned Leave నిల్వ లేనప్పుడు... అనివార్యంగా జీతనష్టపు అసాధారణ సెలవు (Extraordinary Leave on Loss of Pay) మంజూరు చేయాల్సి ఉంటుంది. మామూలుగానైతే, జీతనష్టపు అసాధారణ సెలవు మంజూరు ఎన్ని రోజులు ఉంటుందో.... అన్ని రోజులు వార్షిక ఇంక్రిమెంటును కూడా పోస్టుపోన్ చేస్తారు. కానీ, సస్పెన్షన్ పీరియడ్ కు అసాధారణ సెలవు మంజూరు అయిన సందర్భంలో మాత్రం ఆ EOL పీరియడ్ ను ఇంక్రిమెంట్లకు, పెన్షన్ లెక్కించాల్సిందే. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం Sub-Rule (5) of FR-54 మరియు Sb-Rule (7) of FR-54 ను సవరిస్తూ... GO Ms No 307 Fin (FR.II) Department dated 03.12.2012 నంబర్ జీవో జారీచేసింది.


Post a Comment

0 Comments