INCOME TAX CALCULATION Financial Year 2020-21 Assessment Year 2021-22

Income Tax 2020-21


 INCOME TAX CALCULATION F.Y.2020-21/A.Y.2021-22

👌ఈ సంవత్సరం ఆదాయ పన్ను గణన కోసం రెండు రకాల పద్దతులు అందుబాటులో ఉన్నాయి.

👌1. గత సంవత్సరం (2019-20) వాడిన పద్దతిని ఈ సంవత్సరం  కూడా  వాడుకోవచ్చును. ఇందులో మినహాయింపులు ఉంటాయి.

👌 2.ఇది ఈ సంవత్సరం (2020-21) అందుబాటులోకి వచ్చింది.ఇందులో ఎటువంటి మినహాయింపులు ఉండవు.

పై వాటిలో మనకు ఏది లాభదయకమో దాన్ని మనం వాడుకోవచ్చు.

👌ఆదాయం పరిధిలోకి వచ్చే అంశాలు :

👌 1.మూలవేతనం (Basic Pay), 2.కరువుభత్యం(DA), 3.ఇంటి అద్దె (HRA), 4.Family Pay,5.Personal Pay,6.Leave Salary, 7.Surrender Leave, 8.Pension, 9.ఇతరత్రా రెమ్యునరేషన్ ,10.CCA  మొదలగునవి ఆదాయ పన్ను చట్టం u/s 17 ప్ర కారం ఆదాయ పరిధిలోకి వచ్చే అంశాలు .

👌ఆదాయం పరిధిలోకి రాని అంశాలు :

👌 1.TA,  2.DA (డైలీ అలవెన్సు), 2.LTC, 4.PHC Allowance, 5.పదవీ  విరమణ సౌలభ్యాలు . 6.GPF/PPF ఉపసంహరణలు, 7.పదవీ విరమణ సమయంలో చేసిన ఉపసంహరణలు

👌పాత పద్దతికి అదాయలోనుంచి మినహాయింపులు:

👌 1.షరతులతో కూడిన HRA మినహాయింపు వర్తిస్తుంది.

దీనికి ఈ క్రింది షరతుల వర్తిస్తాయి.

(i)     Actual HRA Received (Salary ద్వారా వచ్చేది)

(ii)   Actual House Rent(ఇంటి అద్దె) Paid minus 10% of Salary (Basic Pay+DA)

(iii) 40% of Salary (Basic Pay+DA)

పై మూడింటిలో ఏది తక్కువో దాన్ని మినహాయింపుగా పొందవచ్చు.

House Rent Yearly Rs.36000/- దాటితే House Rent Receipt ఇవ్వవలసి ఉంటుంది.

House Rent Yearly Rs.100000/- దాటితే House Owner Pan Card ఇవ్వవలసి ఉంటుంది.

👌 2. Standard Deduction -50000/-

👌 3.Profession Tax

👌 4.House Loan Interest U/s 24(B) క్రింద Rs.2,00,000/- Maximum వరకు మినహాయింపు కలదు.

👌 5.Chapter VI మినహాయింపులు :

👏 a) 80C- GPF, LIC, Tuition Fee, Sukanya Samriddi, PPF, RD, House Registration Charges, TSGLI, GIS, Other Insurance Policies Amount, EPF, other savings, etc.

👏 b) 80CCC – కేంద్ర ప్రభుత్వంచే అమోదించబడిన LIC లాంటి మొదలైన  Pension Funds.

👏 c) 80CCD- CPS (NPS Pension Fund)

పై మూడు కలిపి  మొత్తంగా రూ.1,50000/-వరకు పరిమితి

👏 d) 80CCD(1B) – దీని ప్రకారం CPS ఉద్యోగులకు అదనంగా Rs.50000/- మినహాయింపు పొందవచ్చు. కానీ 80C+80CCC+80CCD మొత్తం Rs.1,50000/-లు నిండినపుడు, Rs.1,50000/-ల కంటే ఎక్కువగా ఉన్న పై అక్కడి CPS అమౌంట్  ను ఇక్కడ చూపించవచ్చు.

👏 e) 80D – Health Insurance – Self: Rs.25000/-, Parents (below 60Yrs): Rs.25000/-,

Parents (above 60Yrs) : Rs.50000/-,

👏 f) 80DD – Employee  మీద అధారపడ్డ Dependent Disabled Person ఉంటే వారికి వైద్య ఖర్చుల(Medical Expenditure) నిమిత్తం Rs.75000/- వరకు, వారి వైకల్యం 80% పైన వుంటే Rs.125000/- వరకు మినహాయింపు పొందవచ్చు. ఈ మినహాయింపు ఇచ్చే అధికారం DDOలోకు లేదు. E filling చేసేటప్పుడు మాత్రమే చూపించి Refund పొందవచ్చు. దీనికి PHC Certificate Submit చేయవలసి ఉంటుంది.

👏g) 80DDB – Medical Expenditure (కాన్సెర్ , ఎయిడ్స్ , కిడ్నీ ఫెయిల్యూర్, న్యురోలాజికల్ డిసిజేస్ మొదలగునవి ) Rs.40000/-వరకు సీనియర్ సిటిజన్స్ అయితే Rs.100000/- వరకు మినహాయింపు పొందవచ్చు. ఈ మినహాయింపు ఇచ్చే అధికారం DDOలోకు లేదు. E filling చేసేటప్పుడు మాత్రమే చూపించి Refund పొందవచ్చు. దీనికి ప్రభుత్వ సివిల్ సర్జన్ డాక్టర్ ప్రిస్క్రిప్సన్ అవసరం.

👏h) 80E – Education Loan Interest upto 8Years. Interest కు Maximum లేదు.

👏i) 80EE – House Loan Interest  U/s 24(B)  Rs.2,00,000/- కి  అదనం. ఇక్కడ Maximum Limit Rs.50,000/-

దీనికి ఈ క్రింది షరతుల వర్తిస్తాయి:

(i)     ఇంటి ఋణం 01-04-2016 నుండి 31-03-2017 లో తీసుకోని ఉండాలి.

(ii)   ఇంటి విలువ రూ.50 లక్షల లోపుగా ఉండాలి.

(iii) మొదటిసారి కట్టుకొన్న ఇల్లై ఉండాలి.

(iv)  ఇంటి ఋణం రూ.35 లక్షల లోపు ఉండాలి.

👏 j) 80EEA –  House Loan Interest  U/s 24(B)  Rs.2,00,000/- కి  అదనం. ఇక్కడ Maximum Limit Rs.1,50,000/-

దీనికి ఈ క్రింది షరతుల వర్తిస్తాయి:

(i) దీని క్రింద మినహాయింపు పొందాలంటే , 80EE క్రింది మినహాయింపు పొందకూడదు.

(ii) ఋణం తీసుకోని నాటికి ఇంకో ఇల్లు ఉండకూడదు.

(iii) ఇంటి ఋణం 01-04-2019 నుండి 31-03-2020 మద్య తీసుకోని ఉండాలి.

(iv) ఇంటి విలువ రూ.45 లక్షల లోపు ఉండాలి.

(v)  తము నివసిస్తున్న ఇంటి మరమ్మత్తు మరియు పునరుద్ధరణ కోసం అప్పు తీసుకోని వుంటే , వడ్డీ భాగం రూ.30 వేలు మాత్రం మినహాయింపు కలదు.

👏 k) 80G – ప్రభుత్వ పథకాలకు ఇచ్చిన విరాళాలుకు ఇక్కడ మినహాయింపు పొందవచ్చు.

👏 l) 80GG – Salary తో HRA రానివాళ్ళు ఇక్కడ వారి ఇంటి అద్దెను మినహాయించుకోవచ్చు. ముఖ్యంగా ఇది Pensioner వాళ్ళకు ఉపయోగపడుతుంది.

దీనికి ఈ క్రింది షరతులు వర్తిస్తాయి:

(i) ఇంటి అద్దె తమ ఆదాయంలో 10% లోపు ఉండాలి.

(ii) లేదా నెలకు రూ.5000/- వేల వరకు తగ్గించుకోవచ్చు.

👏 m) 80GGC – గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఇచ్చిన విరాళాల ఇక్కడ మినహాయింపు పొందవచ్చు. ఇది DDOలో కు అధికారం లేదు.

👏 n) 80U – PHC Employee అయితే Rs.75000/-, వారి వైకల్యం 80% పైన వుంటే Rs.125000/- వరకు మినహాయింపు పొందవచ్చు. దీనికి PHC Certificate Submit చేయవలసి ఉంటుంది.

👏 o) 80TTA – Saving Interest in Bank or Post Office Rs.10000/-Maximum మినహాయింపు పొందవచ్చు.

👏 p) 80TTB – సీనియర్ సిటిజన్స్ అయితే Saving Interest in Bank or Post Office Rs.0000/-Maximum మినహాయింపు పొందవచ్చు.

INCOME TAX SLAB RATES FOR F.Y.2020-21/A.Y.2021-22

 (Below 60 Years)

Taxable Income

Tax Rate
 (Old/Existing Scheme)

Tax Rate
(New Scheme)

Up to  Rs.2,50,000/-

Nil

Nil

Rs.2, 50,000/- to Rs.5, 00,000/-

5%

5%

Rs.5, 00,001/- to Rs.7, 50,000/-

20%

10%

Rs.7, 50,001/- to Rs.10, 00,000/-

20%

15%

Rs.10, 00,001/- to Rs.12, 50,000/-

30%

20%

Rs.12, 50,001/- to Rs.15, 00,000/-

30%

25%

Above Rs.15, 00,000/-

30%

30%


INCOME TAX SLAB RATES FOR F.Y.2020-21/A.Y.2021-22

 (60 Years to 79 Years-Senior Citizens)

Taxable Income

Tax Rate
 (Old/Existing Scheme)

Tax Rate
(New Scheme)

Up to  Rs.2,50,000/-

Nil

Nil

Rs.2, 50,000/- to Rs.3, 00,000/-

Nil

5%

Rs.3, 00,001/- to Rs.5, 00,000/-

5%

5%

Rs.5, 00,001/- to Rs.7, 50,000/-

20%

10%

Rs.7, 50,001/- to Rs.10, 00,000/-

20%

15%

Rs.10, 00,001/- to Rs.12, 50,000/-

30%

20%

Rs.12, 50,001/- to Rs.15, 00,000/-

30%

25%

Above Rs.15, 00,000/-

30%

30%

 

INCOME TAX SLAB RATES FOR F.Y.2020-21/A.Y.2021-22

 (Above 80 Years Super Senior Citizens)

Taxable Income

Tax Rate
 (Old/Existing Scheme)

Tax Rate
(New Scheme)

Up to  Rs.2,50,000/-

Nil

Nil

Rs.2, 50,000/- to Rs.5, 00,000/-

Nil

5%

Rs.5, 00,001/- to Rs.7, 50,000/-

20%

10%

Rs.7, 50,001/- to Rs.10, 00,000/-

20%

15%

Rs.10, 00,001/- to Rs.12, 50,000/-

30%

20%

Rs.12, 50,001/- to Rs.15, 00,000/-

30%

25%

Above Rs.15, 00,000/-

30%

30%

 

👌 మరికొన్ని తెలుసుకోదగిన విషయాలు:

👏1. సంవత్సర ఆదాయం రూ.2,50,000/- దాటినవాళ్లు ప్రతి ఒక్కరు Tax పడనివాళ్ళు సైతం ప్రతి సంవత్సరం 31’July వరకు IT Return Onlineలో దాఖలు చేయవలసి ఉంటుంది.

👏 2. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగులైతే , ఒకే ఇంట్లో ఉంటే వారు తమ ఇంటి అద్దె ఒక్కరే చూపించుకోవాలి.

👏 3. గత సంవత్సరం రావలసిన జీతం బకాయిలు ప్రస్తుత సంవత్సరం లో వస్తే ఆయా ఆర్థిక సంవత్సరానికి చూపిస్తూ పన్ను భారం తగ్గించుకోవచ్చు.

👏 4. Tuition Fee కూడా ఇద్దరు పిల్లలకు మాత్రమే వాడుకోవాలి. ఇద్దురు ఉద్యోగుల్లో ఒక్కరే వాడుకోవాలి. గరిష్టంగా రూ.1,50,000/-.

👏 5. Salary Persons July’31 లోగా IT Return దాఖలు చేయడం ద్వారా ఎన్నో లాభాలు ఉంటాయి. ఈ రిటర్న్ ను మీ ఆదాయ దృవీకరణ పత్రంగా ఆర్థిక సంస్థలు మరియు విదేశీ సంస్థలు గుర్తిస్తాయి.

👏 6. భార్య భర్తలు ఇద్దురు జాయింటుగా ఇంటి ఋణం తీసున్నప్పుడు వారిరువురికి గరిష్టంగా రూ.2,00,000/- మినహాయింపు పొందవచ్చు.

👏 7.ఇన్కమ్ టాక్స్ U/s 203 ప్రకారం DDOలు  ఉద్యోగి చెల్లించిన ఆదాయం పన్ను వివరాలు తెల్పుతూ Form-16ను May’31 లోపు ఉద్యోగికి ఇవ్వవలసి ఉంటుంది.

👏 8. ఇన్కమ్ టాక్స్ U/s 203 ప్రకారం DDOలు  ఉద్యోగులు చెల్లించిన ఆదాయ పన్ను వివరాలు తెల్పుతూ Form-24Q NSDLలో Online Upload చేయవలసి ఉంటుంది. DDO లు  TDS దాఖలు చేయవలసిన తేదీలు క్రింది విధంగా ఉంటాయి.

Quarter

Which Months Belongs in this Quarter

Last Date to Submit TDS in this Quarter

1st

Apr’1st to Jun’30th Salaries

 (Mar,Apr,May Salaries)

July-31st

2nd

Jul’1st to Sep’30th Sep’30th

 (Jun,Jul,Aug Salaries)

October-31st

3rd

Oct’1st to Dec’31st

 (Sep, Oct, Nov Salaries)

January-31st

4th

Jan’1st to Mar’31st

 (Dec,Jan,Feb Salaries)

May-15th  


Download Income Tax 2020-21 Excel Programme File Click Here


Click Here to View How to Calculate Income Tax 2020-21

Post a Comment

0 Comments