Employees Questions and Answers on Service Rules

Employees Questions and Answers on Service Rules

Employees Questions and Answers on Service Rules


1.సందేహం: 

వేసవి సెలవుల్లో విదేశాలకు వెళ్ళుటకు పాఠశాల విద్యాశాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలా? తిరిగి విధులలో చేరిన అనంతరం ఎటువంటి సెలవులు వినియోగించుకోవాలి? 👇

సమాధానం: 

''Govt. Memo No. 4017/Ser.II/A/2014-2, తేది:30-12-2014'' అనుసరించి తప్పనిసరిగా విదేశాలకు వెళ్ళుటకు 6 నెలల పరిమితితో  పాఠశాల విద్యాశాఖ నుండి అనుమతి పొందాలి. అర్హతగల సెలవులు (HPL/EL/EOL) HPL కమ్యూటెడ్ కాకుండా వినియోగించుకోవాలి.

2.సందేహం:

భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగులు . ఒకరు రిటైర్మెంట్ అయ్యారు.పెన్షన్ వస్తుంది. రెండవ వారు మరణించిన  వారి వారసులకి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇస్తారా? 👇

సమాధానం:

Memo No.3548 ; GAD ; తేది: 24-03-12 ప్రకారం ఒకరికి పెన్షన్ వచ్చుచున్నందున కారుణ్య నియామకం వర్తించదు.

3.సందేహం:

నేను , మరొక  టీచర్ ఇద్దరం ఒకే రోజు SA లుగా పదోన్నతి పొందాము. ఒకే రోజు జాయిన్ అయ్యాము. SAక్యాడర్ లో ఎవరు సీనియర్ అవుతారు? 👇

సమాధానం:

SGT క్యాడర్ లో ఎవరు సీనియర్ ఐతే , వారే SA క్యాడర్ లో కూడా సీనియర్ అవుతారు.

4.సందేహం:

నేను హైస్కూల్ లో రికార్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను. నాకు మహిళా టీచర్లకి ఇచ్చే 5 స్పెషల్ CL లు ఇవ్వడం లేదు.ఎందువల్ల? 👇

సమాధానం:

G.O. No. 374, తేది: 16-03-1996  ప్రకారం 5 స్పెషల్ CL లు కేవలం మహిళా టీచర్ల కి మాత్రమే వర్తిస్తాయి.

5.సందేహం:

ఒక ఉపాద్యాయుడు SA క్యాడర్ లో 12 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసాడు.అయితే Departmental Test EOT/GOT పరీక్షలు పాస్ కాలేదు. తదుపరి పాస్ అయితే 12 సంవత్సరాల స్కేల్ ఎప్పటినుండి  ఇస్తారు? 👇

సమాధానం:

FR-26(a) రూల్ 2 ప్రకారం చివరి పరీక్షా మరుసటి రోజు నుండు సంవత్సరాల స్కేలు మరియు ఆర్థిక లాభం ఇవ్వాలి.

6.సందేహం:

నేను , మరొక టీచర్ ఇద్దరం ఒకేసారి స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందాము. HM పదోన్నతికి మా ఇద్దరిలో ఎవరు సీనియర్ ? 👇

సమాధానం:

RC.No. 142 , తేది: 11-08-2011 ప్రకారం SGT లో సీనియర్ అయిన ఉపాద్యాయుడు SAలో సీనియర్ అవుతాడు . వారికే ముందు HM పదోన్నతి వస్తుంది.

7.సందేహం:

సర్వీస్ మొత్తం మీద ఎన్ని కమ్యూటెడ్ సెలవులు వాడుకోవాలి? 👇

సమాధానం:

సర్వీస్ మొత్తం మీద 240 రోజులు కమ్యూటెడ్ సెలవుగా వాడుకోవచ్చు. అప్పుడు అర్థ జీతపు సెలవు ఖాతా నుండి 480 రోజులు తగ్గించబడుతాయి.ఆ తర్వాత కూడా సెలవు అవసరం ఐతే కేవలం అర్థ జీతపు సెలవు గా మాత్రమే ఖాతాలో నిల్వ ఉన్నంత వరకు వాడుకోవచ్చు.

8.సందేహం:

ఒక ఉపాద్యాయుడు ప్రమోషన్  ఎన్నిసార్లు తిరస్కరించాడని అవకాశం ఉంది? 👇

సమాధానం:

వాస్తవంగా ప్రమోషన్ ఒక్కసారి కూడా రాత పూర్వకంగా తిరస్కరించడానికి వీలులేదు.అయితే  ప్రభుత్వ Cir.Memo No. 10445/Ser-D/2011, GAD తేది: 01-06-2011  ప్రకారం ఒక్కసారి మాత్రం ప్రమోషన్ ఆర్డర్ తీసుకుని (లేదా) తీసుకోకుండా ప్రమోషన్ పోస్ట్ లో చేరకుండా చేయవచ్చు. అటువంటి వారి పేర్లు మరుసటి సంవత్సరం ప్యానల్ లిస్టులో చేరుస్తారు. ఆ తర్వాత ఇక చేర్చారు.  (G.O.Ms.No. 145, GAD, Dt: 15-06-2004)

 



























































 

Post a Comment

0 Comments