Family Planning Leaves to Employees in Govt Department Telangana SKBadi

 కుటుంబ నియంత్రణ సెలవులు

Family Planning Leaves


 పురుష ఉద్యోగులు వేసక్టమి ఆపరేషన్ చేయించుకున్న సందర్భంలో వారికి ఆరు రోజులకు (6) మించకుండా ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.ఒకవేళ అట్టి ఆపరేషన్ ఏ కారణంచేతనైన ఫలించని యెడల మెడికల్ అధికారి సర్టిఫికెట్ ఆధారంగా మరల ఆరు(6) రోజులు మంజూరు చేయవచ్చు. (G.O.Ms.No.1415 M&H తేది:10-06-1968) (G.O.Ms.No.257 F&P తేది:05-01-1981)

 మహిళా ఉద్యోగులు ట్యూబెక్టమి ఆపరేషన్ చేయించుకున్న సందర్భంలో వారికి పధ్నాలుగు రోజులకు (14)మించకుండా ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు. ఒకవేళ అట్టి ఆపరేషన్ ఏ కారణంచేతనైన ఫలించనియెడల మెడికల్ అధికారి సర్టిఫికెట్ ఆధారంగా మరల పద్నాలుగు(14) రోజులు మంజూరుచేయవచ్చు. (G.O.Ms.No.1415 M&H తేది:10-06-1968) (G.O.Ms.No.124 F&P తేది:13-04-1982)

☑ కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స భార్య చేయించుకున్నచో ఆమెకు సహాయం చేయుటకు ఉద్యోగి అయిన భర్తకు ఏడు(7) రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు. (G.O.Ms.No.802 M&H తేది:21-04-1972) 

☑ మహిళా ఉపాధ్యాయులు గర్భనిరోధక సాధనం(LOOP) అమర్చుకున్నరోజు ఒక(1) రోజు ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు. (G.O.Ms.No.128 F&P తేది:13-04-1982) 

 ఇద్దరికంటే తక్కువ పిల్లలున్నప్పుడు,ఆపరేషన్ తరువాత మగ,ఆడ పిల్లలందరూ చనిపోయినపుడు రీకానలైజేషన్ చేయించుకునే మహిళా ఉద్యోగికి 21 రోజులు లేదా అవసరమైన రోజులు ఏది తక్కువైతే ఆమేరకు మంజూరుచేస్తారు. (G.O.Ms.No.102 M&H తేది:19-02-1981)

☑ మహిళా ఉద్యోగి హిస్టరెక్టమి ఆపరేషన్(గర్భసంచి తొలగింపు) శస్త్రచికిత్స చేయించుకున్న సందర్భంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ సిఫారసుమేరకు 45 రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు. (G.O.Ms.No.52 F&P తేది:01-04-2011)

☑ మహిళా ఉద్యోగులు గర్భవిచ్చితి(Medical Termination of Pragnancy) తర్వాత Salpingectomy (గర్భాశయనాళతొలగింపు) ఆపరేషన్ చేయించుకున్నచో సందర్భంలో పద్నాలుగు(14) రోజులకు మించకుండా ప్రత్యేక ఆకస్మిక సెలవు పొందవచ్చు. (G.O.Ms.No.275 F&P తేది:15-05-1981)

☑ చట్టబద్దంగాగానిఅప్రయత్నంగా గాని గర్భస్రావం(Abortion) జరిగినచో వారాల సెలవు మంజూరు చేయబడును. (G.O.Ms.No.762 M&H తేది:11-08-1976)

Post a Comment

0 Comments