Should I be vaccinated - Does it work- Is it contagious again - If you want to read Info

Should I be vaccinated? Does it work ?
Is it contagious again ?  If you want to read Info!

 --వేక్సిన్ వేసుకోవాలా..? --పనిచేస్తుందా..?  --మళ్లీ సోకుతుందా..? --చదవాల్సిన ఇన్ఫో…!

Vaccine Vesukovala-Leda


👉వ్యాక్సిన్ పనిచేస్తదా..? వేసుకోవచ్చా..? ఎనీ గ్యారంటీ…! మొదట వ్యాక్సిన్ అంటే ఏమిటి, ఎలా పనిచేస్తుంది, ఏ విధంగా తయారు చేస్తారు, మనం తీసుకోబోయేది ఏ విధంగా తయారు చేశారు, మన శరీరం నిర్మాణం, మన Health ప్రొఫైల్ లాంటి చాలా విషయాల మీద ఇదంతా ఆధారపడి ఉంటుంది.

👉సాధారణంగా ఏదైనా నిజమైన వైరస్ మన శరీరంలోకి ప్రవేశిస్తే, వ్యాధినిరోధక కణాలు (Anti Bodies) ఉత్పత్తి అయ్యి ఆ వైరస్ ని నిర్వీర్యం చేస్తాయి. ఇది సాధారణ జీవక్రియ… ఒకవేళ అలా జరగని పక్షంలో లేదా యాంటీ బాడీస్ తక్కువగా ఉన్న సందర్భంలో మనకి ఆ వైరస్ వలన కలిగే వ్యాధి వస్తుంది,.. అప్పుడు ఆ వ్యాధిని నిరోధించటానికి మన శరీరంలోని శక్తి సరిపోలేదు కాబట్టి యాంటీ వైరల్ డ్రగ్స్ లేదా ఇంకేవో వాడాల్సి వస్తది… ఏదైనా వ్యాధి వచ్చిందీ అంటే, మనకి యాంటీ బాడీస్ అసలు లేవనీ లేదా తక్కువ ఉన్నాయని కూడా కాదు… ఒకేసారి మన మొఖం మీద గట్టిగా తుమ్మిన ఎవరైనా వ్యక్తికి ఆల్‌రెడీ కరోనా ఉండి ఉందనుకుందాం… ఒకేసారి లక్ష లేదా 4 లక్షల వైరస్ లు ప్రవేశిస్తే మన యాంటీ బాడీస్ సరిపోక కూడా వ్యాధి రావచ్చు… ఆ తర్వాత కొన్ని రోజులకి అదే తగ్గిపోవచ్చు లేదా ట్రీట్ మెంట్ తీసుకోవాల్సి రావొచ్చు…

👉ఇక వ్యాక్సిన్ విషయానికొస్తే,.. వ్యాక్సిన్ అంటే మందు కాదు… వ్యాక్సిన్ ని 5-8 రకాలుగా తయారు చేస్తారు… నిజమైన వైరస్ ని తీసుకొని, దాన్ని ఫార్మాల్డిహైడ్ లాంటి రసాయనాలతో చంపేసి, ఆ మృత వైరస్ ని శరీరంలోకి ప్రవేశపెడితే, నిజమైన వైరస్ వచ్చింది అనుకొని మన శరీరంలో యాంటీ బాడీస్ ఉత్పత్తి అవుతాయి… కొన్నిసార్లు సింగిల్ వైరస్ ని, మరికొన్నిసార్లు కీడు చేసే జీన్స్ ని తొలగించి, బతికున్న వైరస్ నే వ్యాక్సిన్ గా ఇస్తారు… 

👉ఇంకొన్నిసార్లు హానికరమైన వైరస్ జీన్స్ స్థానంలో బ్యాక్టీరియా జీన్స్ పెట్టి, మిగతాది అంతా వైరస్ జీన్సే ఉంచి, రీ కాంబినెంట్ టెక్నాలజీ ద్వారా చేసిన వైరస్ ని ఎక్కిస్తారు. ఈ విధంగా చాలా రకాలుగా వ్యాక్సిన్ ని తయారు చేస్తారు… 

👉కరోనా వైరస్ కి భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ అనేది కరోనా వైరస్ ని తీసుకొని, దాన్ని చంపి, చనిపోయిన కరోనా వైరస్ ని ఇంజెక్షన్ రూపంలో ఇస్తున్నారు

👉ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవీషీల్డ్ నేది కరోనా వైరస్ లాగా ఉండే ఎడినో వైరస్ ని తీసుకొని, రీ కాంబినెట్ టెక్నాలజీ ద్వారా చేసిన వ్యాక్సిన్… చనిపోయిన కరోనా వైరస్ ఎక్కించినా, ఎడినో వైరస్ తో చేసిన వ్యాక్సిన్ ఎక్కించినా శరీరంలో యాంటీ బాడీస్ ఉత్పత్తి అవుతాయి. ఈ రెండు మాత్రమే ఇండియాలో ఎక్కువ లభ్యమవుతున్నై కాబట్టి వీటి గురించి ప్రతి ఒక్కరూ పూర్తిగా తెలుసుకోవాలి…

👉మరి 100% పనిచేస్తాయా..? 

👉వాళ్ళు చేసిన క్లినికల్ ట్రయిల్స్ ప్రకారం 62% ఎఫెక్టివ్, 90% ఎఫెక్టివ్, 70% ఎఫెక్టివ్ ఇలా ఇచ్చారు… దాని అర్ధం వాళ్ళు క్లినికల్ ట్రయిల్స్ చేసినప్పుడు 100 మందికి ఇస్తే 70 మందిలో మాత్రమే యాంటీబాడీస్ ఉత్పత్తి అయ్యాయి అని అర్ధం… సో ఏదీ 100% వర్క్ అవుట్ కాదు… మనకి పని చేయొచ్చు, చేయకపోవచ్చు… 

👉వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా కరోనా వచ్చింది, దీని అర్ధం ఏమిటి..? 

👉ఇక్కడ 2-3 కారణాలు ఉంటై… 

👉1). ఆ వ్యాక్సిన్ మనకి ఎఫెక్టివ్ కాదు•

👉2). వ్యాక్సిన్ సమర్ధవంతమైనదే కాని మనలో కొన్ని కారణాల వలన యాంటీబాడీస్ కాంప్రమైజ్ అయ్యి ఉత్పత్తి అవ్వలేదు. 

👉3). యాంటీ బాడీస్ ఉత్పత్తి అయ్యాయి కాని కొన్ని రోజులే ఉన్నై, అ తర్వాత ఎవరినుంచో కరోనా వచ్చింది.ఈ విధంగా చాలా కారణాలు  ఉంటై… 

👉మళ్ళీ వైరస్ విషయానికొస్తే…. 

👉మరి ఏ వ్యాక్సిన్ వేసుకోవాలి..?

👉భారత్ బయోటెక్ వాళ్లేమో చనిపోయిన వైరస్ ని ఎక్కిస్తున్నారు. ఆస్ట్రాజెనికా కోవీషీల్డ్ ఎడినో వైరస్ నుంచి తయారు చేసినది… ఏ ఇతర జబ్బులు ఉన్నా 97% భారత్ బయోటెక్ కొవాక్సిన్ వేసుకోవచ్చు… కారణం, ఆ ఇంజెక్షన్ వేసాక పెద్దగా రియాక్షన్స్ ఏమీ జరగవు… ఒక చనిపోయిన వైరస్ ని చూసి నిజమైన వైరస్ అనుకొని యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి… ఎక్కువ సంఖ్యలో యాంటీబాడీస్ ఉత్పత్తి అయితే అత్యంత పెద్ద జబ్బులు ఉన్నవారికి ఏమైనా అవుతుందా అనేది సరైన నిపుణులని అడిగి తెలుసుకోవాలి. కాని సాధారణంగా అందరూ తీసుకోవచ్చు… పైజర్ ఇంకేదో m- RNA వ్యాక్సిన్ ల విషయానికొస్తే, వ్యాక్సిన్ తీసుకున్నాక శరీరంలో కొన్ని రియాక్షన్స్ జరుగుతాయి, అది సెపరేట్ ఇక్కడ అప్రస్తుతం… అయితే కొవాక్సిన్ తీసుకున్నా, కోవీషీల్డ్ తీసుకున్నా అవి సమర్ధవంతంగా మనకి పనిచేస్తాయా లేవా అనే గ్యారంటీ అయితే లేదు.., వ్యాక్సిన్ సమర్ధవంతంగా ఉండి, యాంటీ బాడీస్ ఉత్పత్తయినా, అవి ఎల్లకాలం ఉండే అవకాశం అందరికీ ఉండదు…

👉వేక్సిన్ వేసుకున్నా సరే, కొత్తగా కరోనా సంక్రమించబోదు అనేది అబద్ధం… 

👉వేక్సిన్ వేసుకున్నా సరే, ఏదో కారణంతో కరోనా వైరస్ మన దేహంలోకి ప్రవేశించవచ్చు… అప్పుడు టెస్టులు చేస్తే పాజిటివే వస్తుంది… కానీ ఆ వైరస్‌ను చంపేయగల యాంటీ బాడీస్ మన దేహంలో ఉత్పత్తవుతాయి కాబట్టి ఆ వైరస్ మనల్ని ఏమీ చేయలేదు… ఇదీ క్లారిటీ…

👉మరి ఇంకేదో వైరస్ కి వ్యాక్సిన్ తీసుకుంటే, దానికి సంబంధించిన వ్యాధి ఎన్ని సంవత్సరాలు అయినా రాలేదు, అది 100% పనిచేసింది కదా, మరి కరోనా వైరస్ కి ఎందుకు అలా జరగదు అంటే… వేరే వైరస్ కి మనం వ్యాక్సిన్ తీసుకున్నాం, ఆ రోజుల్లో యాంటీ బాడీస్ ఉత్పత్తి అయ్యాయి, దానికి సంబంధించిన యాంటీ బాడీస్ మన శరీరంలో లేకపోయినా ఇప్పుడు ఆ వైరస్ బయట లేదు..; కానీ ఇప్పుడు కరోనా వైరస్ ప్రతి జిల్లాలో ఉంది, కాబట్టి ఇది డిఫరంట్… మరీ అతి పెద్ద వ్యాధులు, ఇతర అనారోగ్య కండీషన్స్ ఉన్న వాళ్ళు మినహా అందరూ తీసుకుంటే ఆ వైరస్ ని పూర్తిగా పారద్రోలవచ్చు… ఆ తర్వాత యాంటీ బాడీస్ ఉత్పత్తి కాకపోయినా, ఉత్పత్తి అయిన యాంటీ బాడీస్ నిర్వీర్యం అయినా ఏమీ కాదు… కరోనా వైరస్ ప్రపంచం నుంచి వెళ్ళిపోయేవరకు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మనదేశంలో పూర్తిగా పోయినా, ఎక్కడో ఒక దేశంలో ఉంటే, ఎవరో ఒకరి ద్వారా మళ్ళీ వ్యాపిస్తుంది; అందుకే ఇంకో సంవత్సరం వరకు అందరూ కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది…

👉వ్యాక్సిన్ పూర్తి పరిష్కారం కాదు… కానీ చాలా ఉపయోగం ఉంది… వీలైనంత ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకోవాలి, అందరూ జాగ్రత్తలు పాటించాలి…!

@@@

✅ Does the vaccine work? Can you wear it ..? Any guarantee…! First of all it all depends on a lot of things like what the vaccine is, how it works, how it is made, how we are going to take it, our body structure, our health profile.

✅ Usually when any real virus enters our body, immune cells (Anti Bodies) are produced and neutralize the virus. This is a normal metabolism  If that does not happen or we have low levels of antibodies, then we get the disease caused by the virus. Then our body does not have enough energy to prevent the disease so we have to use antiviral drugs or something else… If we have any disease, we have antibodies to the original Not even those that are low or low  Suppose someone who sneezes heavily on our mouth at once has an Already corona If one or 4 lakh viruses enter at once our antibodies may also be inadequate After a few days the same may be reduced or the treatment may have to be taken.

✅ As for the vaccine, the vaccine is not a drug . The vaccine is made in 5-8 types. If we take the real virus and kill it with chemicals like formaldehyde and inject that dead virus into the body, our body will produce antibodies thinking that the real virus has arrived Sometimes the single virus, and sometimes the harmful genes, are removed and the surviving virus is vaccinated.

✅ Sometimes the bacterial genes are put in place of the harmful virus genes, and everything else is put into the virus genes and the virus is transmitted through recombination technology. There are several ways in which a vaccine can be made.

✅ Kovacsin, a biotech made by India Biotech, takes the corona virus, kills it and injects the dead corona virus into the corona virus.

✅ Cow Shield, made by Astrogenica, is a vaccine made by recombinant technology that takes the adenovirus, which is similar to the corona virus. These two are the only ones that are more available in India so everyone should be fully aware of these

✅ Are it 100% working ..?

✅ According to their clinical trials they gave 62% effective, 90% effective, 70% effective… It means that only 100 out of 70 people produced antibodies when they did clinical trials… So nothing works 100%… We can work, May not

✅ Corona came even after taking the vaccine, what does it mean ..?

✅ Here are 2-3 reasons

1). That vaccine is not effective for us

2). The vaccine is effective but for some reason the antibodies are not compromised and produced in us.

3). Antibodies were produced but only for a few days, after which the corona came from someone. There are many reasons for this.

✅ Again in the case of the virus.

✅ What other vaccine should be given ..?

✅ Bharat Biotech Vallemo is loading the dead virus. Estrogenica CoviShield is made from adenovirus 97 97% of Indian biotech covacine can be injected with any other disease… The reason is that there are no major reactions after the injection Ask the right experts to find out if anything happens. But in general everyone can take… pizzeria In the case of other m-RNA vaccines, there will be some reactions in the body after taking the vaccine, it is irrelevant here… However taking covaccine or covi shield does not guarantee whether they will work effectively for us .., the vaccine is effective, Even if they are produced, they are not likely to last forever.

✅ It is a lie that even if vaccinated, the new corona will not be infected

✅ Even if we are vaccinated, for some reason the corona virus can enter our body  then the tests will be positive… but the virus has done nothing to us because antibodies can be produced in our body that can kill the virus… This is Clarity

✅ If you are vaccinated against another virus, the disease does not come for many years, is it 100% working, and why does it not happen to the corona virus? If not in the body now the virus is not outside ..; But now the corona virus is present in every district, so it is different . The virus can be completely eradicated if taken by everyone except those with very large diseases and other medical conditions… If no antibodies are produced after that, the antibodies produced are nothing but… Corona virus world Definitely need to be careful until you get out. If it is completely gone in our country, if it is in a country somewhere, it will be spread again by someone else; That's why everyone needs to take a little more care until another year

✅ The vaccine is not a complete solution… but it is very useful . As many people as possible should be vaccinated

Post a Comment

0 Comments