Hindu Dharma is a River Based on Knowledge But not on Birth - Some Examples

Hindu Dharma is a Based on Knowledge But not on Birth
హిందూ ధర్మం జ్ఞానం మీద ఆధారపడినది కానీ, జన్మం మీద కాదు

TSGLI Bond


👌హిందువులు అందరూ మొత్తం చదవాల్సిన విషయం..

👌జ్ఞానంతో వ్యవహారిక శుద్ధ జీవనం గడుపుతూ, యుగ యుగాలకు ధిక్సుచిగా మారి బ్రాహ్మణులుగా పేరొందిన మహానుభావులు..

👌జన్మచేత కాదు వర్ణం... జ్ఞానం, వ్యవహారంతో వర్ణం, బ్రాహ్మణులుగా  పూజించబడి ..

👌ఈరోజుకీ పూజింపబడుతూ .. యజ్ఞయాగాలలో నేటికీ హవిర్భాగములు కూడా అందుకుంటున్న  బ్రాహ్మణేతరులు ..

 👌(వజ్రసూచికోపనిషత్తు ప్రకారం ..) 

1. ఋష్యశృంగుడు .. జింకలు పట్టుకునే జాతులకు పుట్టినవాడు.

2. కౌశికుడు .. గడ్డి కోసుకునే జాతికి చెందినవాడు.

3. జంబూక మహర్షి .. నక్కలు పట్టుకునే జాతివారు ..

4. వాల్మీకి .. ఓ కిరాతకుల జాతికి చెందిన వాడు. ఈతను రచించిన రామాయణం .. హిందువులకు పరమ పవిత్రమైన గ్రంథం. ఈయన్ని ఆదికవిని చేసి పూజిస్తారు.

5. వ్యాసుడు .. ఓ చేపలుపట్టే బెస్తజాతికి చెందినవాడు. హిందువులకు పరమపవిత్రమైన వేదములు .. ఈయన చేత విభజన చేయబడ్డవే. అందుకే ఇతణ్ణి వేదవ్యాసుడు .. అని పూజిస్తారు. 

6. గౌతముడు .. కుందేళ్లు పట్టేజాతికి చెందినవాడు.

7. వశిష్టుడు .. ఓ వేశ్యకు పుట్టినవాడు. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. ఈతని భార్య మాదిగ స్త్రీ అయిన అరుంధతీదేవి. ఈరోజుకు కూడా నూతన దంపతులచేత అరుంధతీవశిష్టులకు నమస్కారం చేసే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ప్రతి పూజలోనూ హిందువులచేత .. అరుంధతీవశిష్ఠాభ్యాం నమః .. అని పూజలందుకుంటున్నారు. వీరి కుమారుడు శక్తి. ఇతని భార్య ఓ మాదిగ వనిత .. ఛండాలాంగని. వీరికుమారుడే పరాశరుడు. ఈతను ఓ బెస్తవనిత మత్స్యగంధిని వివాహమాడి వ్యాసుణ్ణి కన్నారు. 

8. అగస్త్యుడు .. మట్టి కుండల్లో పుట్టినవాడు.

9. మతంగ మహర్షి.. ఒక మాదిగవాని కుమారుడు. బ్రాహ్మణుడయ్యాడు. ఈతని కూతురే .. మాతంగకన్య .. ఓ శక్తి దేవత. కాళిదాసుతో సహా ఎందరో మహానుభావులు ఈ మాతను ఉపాసించారు. ఉపాసిస్తూ ఉన్నారు. ఈమే శ్యామలాదేవి.

ఇంకా ..

1. ఐతరేయ మహర్షి ఒక దస్యుడి మరియు కిరాతకుడి కుమారుడు .. అంటే నేటి లెక్కల ప్రకారం SC or ST. జన్మ బ్రాహ్మణుడు కాదు. కానీ అత్యున్నతమైన బ్రాహ్మణుడు అయ్యాడు. అతను వ్రాసినవే ఐతరేయ బ్రాహ్మణం మరియు ఐతరేయోపనిషత్తు. ఐతరేయ బ్రాహ్మణం చాలా కష్టమైనది. ఇది ఋగ్వేదాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తారు.

2. ఐలుష ఋషి ఒక దాసీ కుమారుడు. అతను ఋగ్వేదంమీద రిసెర్చ్ చేసి చాలా విషయాలు కనిపెట్టాడు. అతన్ని ఋషులందరూ ఆహ్వానించి తమకు ఆచార్యుణ్ణి చేసుకున్నారు ( ఐతరేయ. బ్రా. 2.19)

3. సత్యకామ జాబాల మహర్షి ఒక వేశ్య కుమారుడు. తండ్రి పేరే కాదు.. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. కానీ జ్ఞానం చేత బ్రాహ్మణుడు అయ్యాడు.

ఉన్నతవంశాలలో పుట్టినవారిని కూడా వారిధర్మం నిర్వర్తించకపోతే .. వారిని నిర్మొహమాటంగా బహిష్కరించారు ... వారిలో కొందరు

1. భూదేవి కుమారుడు .. క్షత్రియుడైన నరకుడు .. రాక్షసుడైనాడు.

2. బ్రహ్మవంశజులైన హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు,.. బ్రాహ్మణులైనా .. రాక్షసులయ్యారు ..

3.రఘువంశ మూలపురుషుడైన రఘుమహారాజు కుమారులలో ఒకడు అయిన ప్రవిద్ధుడు .. రాక్షసుడైనాడు. 

4. త్రిశంకుడు క్షత్రియుడు. కానీ చండాలడు అయ్యాడు.

5. విశ్వామిత్రుడు క్షత్రియుడు.. బ్రాహ్మణుడైనాడు .. వీరి వంశస్తులే .. కౌశికస గోత్ర బ్రాహ్మణులయ్యారు. విశ్వామిత్రుని కుమారులు కొందరు అన్యులయ్యారు.

6. నవ బ్రహ్మలలో ఒకడైన దక్ష ప్రజాపతి కుమారుడు పృషధుడు. బ్రహ్మ జ్ఞానం లేని కారణాన అన్యుడిగా మారిపోయాడు ( విష్ణుపురాణం 4.1.14)

7. నేదిష్టుడు అనే మహరాజు కుమారుడు .. నాభుడు. ఇతనికి క్షాత్ర జ్ఞానం లేని కారణాన, వర్తక జ్ఞానం కారణాన వైశ్యుడిగా మారవలసి వచ్చింది  ( విష్ణుపురాణం 4.1.13). 

8. క్షత్రియులైన రథోతరుడు, అగ్నివేశ్యుడు, హరితుడు .. బ్రహ్మ జ్ఞానం వలన బ్రాహ్మణులైనారు. హరితుని పేరుమీదే .. ఇతని వంశబ్రాహ్మణులకు హరితస గోత్రం వచ్చింది (విష్ణుపురాణం 4.3.5).

9. శౌనక మహర్షి కుమారులు .. నాలుగు వర్ణాలకు చెందినవారుగా మారారు (విష్ణుపురాణం 4.8.1).

10. అలాగే గృత్సమదుడు, వీతవ్యుడు, వృత్సమతి ... వీరి కుమారులు కూడా నాలుగు వర్ణాలకు చెందినవారు అయ్యారు.

👌వీరిలో చాలామంది .. వేదమంత్రాలు కూడా రచించిన వారు.

👌హిందూ ధర్మం జ్ఞానం మీద ఆధారపడి నది కానీ, జన్మం మీద కాదు. మంచి మనసున్న ప్రతి హిందువు  జ్ఞానానికి అర్హులే.

@@@

👌All Hindus should read the whole thing ..

👌The great sages who lived a pragmatic pure life with wisdom and became Dhiksuchi for ages and became known as Brahmins.

👌Varnam not by birth ... Varnam with knowledge and business, worshiped as Brahmins ..

Worshiped today .. Non-Brahmins who still receive offerings in rituals ..

👌 (According to the Diamond Index ..)

1. Rushyasrungudu.. Born to deer catching species.

2. Kaushikudu .. belongs to the grass cutting species.

3. Jambuka Maharshi .. Fox-catching species ..

4. Valmiki .. He belongs to a race of villains. The Ramayana written by Eeta is the holiest book for Hindus. It is worshiped as Adikavini.

5. Vyasudu.. A fisherman. The most sacred scriptures for Hindus .. Divided by him. That is why he is worshiped as a theologian.

6. Gautama .. Rabbits belong to the genus Patte.

7. Vashisht .. Born to a prostitute. At least the father doesn’t even know who he is. His wife was Arundhati Devi, a woman from Madiga. To this day, the tradition of saluting Arundhati is still followed by the newlyweds. Arundhativasishthabhyam Namah is worshiped by Hindus in every puja. Whose son is Shakti. His wife is a woman .. Chandalangani. Their son is Parashar. Vyasunni married Ethan, a fisherwoman, and died.

8. Augustus .. Born in clay pots.

9. Matanga Maharshi .. Son of a Madhigavani. Became a Brahmin. His daughter .. Matangakanya .. Goddess of power. Many dignitaries, including Kalidasa, worshiped this word. Are worshiping. This is Shyamaladevi.

More ..

1. Aitareya Maharshi is the son of a Dasyudi and Kiratakudi .. i.e. SC or ST according to today's calculations. Janma is not a Brahmin. But became the supreme Brahmin. He wrote Aitareya Brahman and Aitareopanishattu. Aitareya Brahman is very difficult. It is used to understand the Rig Veda.

2. Ailusha Rishi is the son of a maid. He researched on the Rig Veda and discovered many things. All the sages invited him and made him their teacher (Aitareya. Br. 2.19)

3. Satyakama Jabala Maharshi was the son of a prostitute. Not the father's name .. at least the father doesn't even know who he is. But became a Brahmin by knowledge.

Even those born in the aristocracy were ruthlessly ostracized if they did not perform their duty ... some of them

1. Son of Bhudevi .. Kshatriya hell .. Rakshasudainadu.

2. Hiranyakshuda, Hiranyakashipu, Ravana, who are of Brahma descent .. .. Brahmins .. became demons ..

3. Pravidhudu, one of the sons of Raghumaharaja, the ancestor of the Raghuvansha .. became a demon.

4. Trishankudu Kshatriya. But became a scoundrel.

5. Vishwamitra became a Kshatriya .. a Brahmin .. whose descendants .. the Kaushikasa tribe became Brahmins. Some of Vishwamitra's sons were alienated.

6. Prishadhu was the son of Daksha Prajapati, one of the Nava Brahmins. Brahma became an alien due to lack of knowledge (Vishnu Purana 4.1.14)

7. Nedishtudu is the son of a Maharaja .. Nabhudu. He had to become a Vaishya due to his lack of Kshatriya knowledge and trade knowledge (Vishnu Purana 4.1.13).

8. Kshatriyas chariot, fire, green .. Brahmanulainainaru due to the knowledge of Brahma. Harithu's name is yours .. His descendants got the Haritasa tribe (Vishnu Purana 4.3.5).

9. Sons of Shaunaka Maharshi .. became of four castes (Vishnu Purana 4.8.1).

10. As well as Gritsamadu, Vitavyudu, Vritsamati ... whose sons also became of the four castes.

👌Many of them .. who also wrote Veda Mantras.

👌Hindu Dharma is a river based on knowledge but not on birth. Every good-hearted Hindu deserves knowledge.


Post a Comment

0 Comments