TSGLI BOND WHOSE AGE CROSSED 53 YEARS, G.O.No.904, Dt:26-04-2021

TSGLI BOND  WHOSE AGE CROSSED 53 YEARS, G.O.No.904, Dt:26-04-2021

TSGLI Bond


ప్రభుత్వ ఉద్యోగులకు 53 సంవత్సరాల వయస్సు వచ్చే లోపు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ చందాదారులుగా చేరే అవకాశం ఉంది. వేతనం నుండి చందా మినహాయించిన వెంటనే పాలసీ బాండ్ కోసం ప్రతిపాదనలు పంపుకోవాలి. కొందరు ముందుగా చందా మినహాయింపు చేయించుకున్నప్పటికీ 53 సం. వయసు నిండిన తర్వాత ప్రతిపాదనలు పంపుకుంటే లోగడ ఉన్న నిబంధనల ప్రకారం తిరస్కరించేవారు. అలాంటి వారికి నష్టం జరగకుండా చూసేందుకు ఒక అవకాశం ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు కోరిన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు G.O. No. 904 ను ఈరోజు విడుదల చేశారు.

ఈ ఉత్తర్వుల ప్రకారం ముందుగా చందా చెల్లించి, సకాలంలో ప్రతిపాదనలు పంపుకోలేకపోయిన ఉద్యోగులకు 2021 అక్టోబర్ 31 లోపు 53 సం. నిండినప్పటికీ ప్రతిపాదనలు పంపుకునే అవకాశం కల్పించారు.

@@@

Post a Comment

0 Comments