Promotion Fixation - పదోన్నతి వేతన స్థిరీకరణ


PROMOTION FIXATION - పదోన్నతి వేతన స్థిరీకరణ

Pay fixation of promoted employees


 ఇటీవల ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయులు ప్రమోషన్ పే ఫిక్సేషన్ విధానం అవగాహన కొరకు.....

💥 పదోన్నతి వేతన స్థిరీకరణ G.O.No.96 finance, Date:20-05-2011 , Rule7(viii)  ప్రకారం జరుగును

ఎ). పదోన్నతికి ముందు ఫీడరు కేడర్ నందు 24 Years Scale పొందియున్నచో , వీరు అసలు ఆప్షన్ ఇచ్చే అవకాశం లేదు. వీరికి పదోన్నతి తేదికి ఒక ఇంక్రిమెంట్ FR 22 a (i) ప్రకారంగా వేతన స్థిరీకరణ చేయబడును. మరలా ఫీడరు కేడరు లోని రెగ్యులర్ ఇంక్రిమెంటు FR 31 (2) ప్రకారంగా కొనసాగును. వీరికి పదోన్నత కేదరులో 6/12/18/24 Years Scale పొందుటకు ఎటువంటి అర్హత లేదని గమనించాలి.

బి). పదోన్నతికి ముందు ఫీడరు కేడర్ నందు 24 Years Scale పొందకుంటే , వీరు క్రింద తెలుపబడిన రెండు Options లలో ఏది లాభదాయకం అనుకుంటే దానిని నిర్ణీత Option Form నందు నమోదు పరచి DDO గారికి సమర్పించాలి.

 1.Promotion Date కి   Option ఇచ్చే అవకాశము 👇.

 ▶️ ఆ తేదికే రెండు Increments తో Fixation చేయబడును. వీరికి తదుపరి Increment 12 నెలల తర్వాతనే వస్తుంది. కావున వీరి AGI  Increment Month మారును.

2. Feeder Cadre లోని Regular Increment తేదికి ఆప్షన్ ఇచ్చే అవకాశము  👇 

▶️ వీరికి వేతన స్థిరీకరణ Two times  ( Initially Fixation  మరియు Re-Fixation ) జరుగును.

(a)  Initially Fixation (ఇనిషియల్ ఫిక్సేషన్:)- FR22a(i) ప్రకారంగా Promotion తేదికి ఒక Increment మంజూరు చేస్తారు. Arrears పదోన్నతి తేది నుండి రెగ్యులర్ ఇంక్రిమెంటు తేదికి ముందు రోజు వరకు చెల్లిస్తారు

.(b) Re-Fixation(రీ- ఫిక్సేషన్) -  FR22B ప్రకారంగా ఆప్షన్ ఇచ్చిన రెగ్యులర్ ఇంక్రిమెంట్ తేదికి నార్మల్ ఇంక్రిమెంటుతో పాటుగాLower Cadre లో ఒక ఇంక్రిమెంట్ మరియు Higher Cadre లో మరొక ఇంక్రిమెంట్ తో పాటుగా మూడు ఇంక్రిమెంట్లతో ఇంక్రిమెంట్ తేదీకి fixation చేయుదురు.

▶️ గమనిక: G.O.No.145 Finance, Date: 19-02-2009 ప్రకారంగా ఉద్యోగి నిర్ణీత సమయంలో ఆప్షన్ ఇవ్వకుంటే లాభదాయకంగా ఉండే ఆప్షన్ ఎంచుకొని వేతన స్థిరీకరణ చేయవలసిన భాద్యత DDO.లదే.

 Promotion Date కి తర్వాత ఎంత దగ్గరలో Regular Increment Date ఉంటే అంతగా లాభదాయకం

Promotion Fixation Programme file download 

Post a Comment

0 Comments